తిండి కోసం తిప్పలు.. గుండు కామెంట్‌తో హీటెక్కిన హౌజ్.. వన్ మ్యాన్ షోగా మార్చేసిన మాస్క్ మాన్..

Published : Sep 09, 2025, 12:54 AM IST

Bigg Boss Today Episode: బిగ్ బాస్ 9 తొలి రోజు నుంచే ట్విస్ట్‌లు, ఫన్ టాస్క్‌లు, సర్ప్రైజ్‌లతో కంటెస్టెంట్లు, ప్రేక్షకులను అలరించాడు. ఈ రోజు మాస్క్ మాన్ తన కామెంట్స్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే.. ఫస్ట్ డేనే హౌస్‌ని డామినేట్ చేశాడు. 

PREV
19
తొలి రోజే కంటెస్టెంట్లకు జలక్!

Bigg Boss Today Episode: బిగ్ బాస్ సీజన్ 9 మొదటి రోజే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఉదయం లేవగానే డాన్స్ గ్రూప్‌ని హౌస్‌లోకి పంపించి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని ఈ సర్ప్రైజ్‌తో హౌస్‌లో ఎనర్జీ నింపేశాడు. తర్వాత “ఇన్ హౌస్–అవుట్ హౌస్” టాస్క్‌తో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడగొట్టాడు. ఓనర్స్–టెనెంట్స్‌గా విడిపోయిన గ్రూప్‌లు ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేసే ఫన్ గేమ్ సాగింది.

ఇక ఈ టాస్క్ మధ్యలోనే సెలబ్రిటీ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షాకింగ్ వార్నింగ్ ఇచ్చాడు. “సెలబ్రిటీలు హౌస్‌లో ఎందుకు వచ్చారు?” అని. ఈ అనౌన్స్మెంట్ విన్న వెంటనే అందరూ షాక్ అయ్యారు. అయితే కొద్దిసేపటికి బిగ్ బాస్ మాట మార్చి.. “హౌస్‌లోకి స్వాగతం” అంటూ అనౌన్స్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లందరూ రిలాక్స్ అయ్యి జోష్‌లోకి వచ్చారు. ఈలోగా కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తన స్టైల్ కామెంట్స్‌తో నవ్వులు పూయించాడు.“ఈ ప్రకటన కోసం రాత్రి నుంచే వెయిట్ చేస్తున్నా.. ఫస్ట్ టైమ్ పడుకున్నప్పుడు చెమటలు పట్టాయి” అని చెప్పి హౌస్‌ను అలరించాడు.

29
బిగ్ బాస్ క్లాస్

కంటెస్టెంట్లకు బిగ్ బాస్ స్పెషల్ క్లాస్ ఇచ్చారు. “ఇకనుంచి ఆట ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో ఒకరికి ఒకరు దగ్గర కావచ్చు.. లేకపోతే విభేదాలు పెరగవచ్చు. కానీ మీరు గడిపే ప్రతి క్షణం మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. కొన్నిసార్లు ఆనందం, కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో కాలమే నిర్ణయిస్తుంది. మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్” అంటూ బిగ్ బాస్ స్పీచ్ ఇచ్చి కంటెస్టెంట్లలో జోష్ నింపేశారు.

39
అగ్గిరాజేసిన టాస్కులు

తర్వాత హౌస్ ఓనర్స్ – టీనెంట్స్ టాస్క్ మొదలైంది. బిగ్ బాస్ ఆర్డర్ మేరకు ఓనర్స్, టాస్క్‌లు ఇచ్చి టెనెంట్స్‌ను పరీక్షించారు. ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాలకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఈ సమయంలో ఆశా షైనీని ప్రశంసించాడు. అనంతరం మాస్క్ మాన్ హరీష్ – ఇమ్మానుయేల్ తన టాస్క్ పర్ఫెక్ట్‌గా పూర్తి చేశాడంటూ తన బ్యాచ్ అతనికి ఇచ్చాడు. హౌస్ క్లీనింగ్ – శ్రష్టి వర్మకు ఈ బాధ్యత అప్పగించబడింది. 

అలాగే.. డిమోన్ పవన్ – రీతు చౌదరికి డిష్ వాష్ క్లీనింగ్ టాస్క్ ఇచ్చాడు. ఇక శ్రీజ వచ్చి సింగర్ రాము రాథోడ్‌కి బట్టలు ఉతకడం, పేరెంజ్ చేయడం బాధ్యతలు అప్పగించింది. ఆ తరువాత ప్రియా వచ్చి భరణిని టార్గెట్ చేస్తూ కుకింగ్ బాధ్యతలు అప్పగించింది. అతనికి అసిస్టెంట్‌గా తనుజాని సెలెక్ట్ చేసింది. ఈ సమయంలో శ్రీజ స్పెషల్ స్టేట్మెంట్ ఇచ్చింది – “కుకింగ్ చేసేవారు కిచెన్ క్లీనింగ్ కూడా చేయాలి” అని.

49
మర్యాద మనీష్ vs మాస్క్ మాన్ క్లాష్

క్లీనింగ్ టాస్క్ విషయంలో హౌస్‌లో చర్చ మొదలైంది. మాస్క్ మాన్ ఖాళీగా ఉన్న వాళ్లు కూడా పని చేయాలని డైరెక్ట్ ఆదేశించాడు. కంటెస్టెంట్లలో చాలా మంది దానికి అంగీకరించారు. కానీ మర్యాద మనీష్ జోక్యం చేసుకుని “బిగ్ బాస్ ఆదేశాలను ఎలా అతిక్రమిస్తారు?” అంటూ ప్రశ్నించాడు. దీంతో మాస్క్ మాన్ ఒక్కసారిగా ఆగ్రహంతో “మనీష్ గారు, మీకు బ్యాడ్జ్ రాలేదు. మీరు మాట్లాడకండి!” అని షాకింగ్ కామెంట్ చేశాడు. 

తొలిరోజే ఇద్దరి మధ్య వాగ్వాదం షురూ అయింది. మధ్యలో భరణి వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. మాస్క్ మాన్ ఇంకా ముందుకు వెళ్లి “ఏదైనా రాంగ్ అయితే నేను హౌస్ వదిలి వెళ్ళిపోవడానికి రెడీ” అని చెప్పడంతో హౌస్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

59
ప్లేట్ వదిలి వెళ్లిపోండని బిగ్ బాస్ ఆదేశం

బిగ్ బాస్ హౌస్‌లో ఓనర్స్–టెనెంట్స్ మధ్య టెన్షన్ క్రియేట్ అయ్యింది. భోజనం చేస్తుండగా, “టెనెంట్స్ ఇళ్లు ఓనర్స్‌కే.. మీరు బయటకు వెళ్లండి” అంటూ బిగ్ బాస్ షాకింగ్ ఆదేశం ఇచ్చాడు. ఫుడ్ తీసుకుంటున్న సంజనా, తనూజ, హరీష్, ఇమ్మానుయేల్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ సమయంలో భరణి, ఇమ్మానుయేల్‌ను ఫుడ్ పెట్టమని అడగగా, అతను “వద్దు” అంటూ తినేస్తూ బయటికి వెళ్లిపోయాడు. దీంతో బిగ్ బాస్, “మీ ప్లేట్స్ అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోండి” అని సూటిగా చెప్పేశాడు.

ఈ సీన్‌లో కామనర్స్ హరీష్ సిరీయస్ గా రియాక్ట్ అయ్యారు. “నన్ను తినొద్దని చెప్పండి నేను తినను. కానీ తింటున్నవాడి దగ్గర నుంచి ప్లేట్ లాక్కోను” అంటూ క్లారిటీ ఇచ్చాడు. తర్వాత కామనర్స్, ఇమ్మానుయేల్‌ను “తినేయి” అంటూ సపోర్ట్ చేశారు. దాంతో ఇమ్మానుయేల్ “తినొచ్చా?” అని అడగగా, శ్రీజ “తినండి” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, “ఇది తింటే వచ్చే పనిష్మెంట్ కూడా మేమే తీసుకుంటాం” అని కామనర్స్ ప్రకటించారు. ఒకవైపు ఓనర్స్ లివింగ్ ఏరియాకు పిలవబడ్డారు. టెనెంట్స్‌ను హౌస్ బయటకు నిలబెట్టారు. ఇక నుంచి ఓనర్స్ అనుమతి లేకుండా ఇంట్లోకి రాకూడదని బిగ్ బాస్ రూల్ పెట్టాడు. పంపిన ఫుడ్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టాలని కూడా ఆదేశించాడు.

69
మాస్క్ మాన్ ఎమోషనల్

మాస్క్ మాన్ మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారు. బిగ్ బాస్ ఆదేశాలను పట్టించుకోకుండా సెలబ్రిటీలకు ఫుడ్ ఇవ్వడానికి వెళ్లాడు.బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి ఫుడ్ కిచెన్‌లో పెట్టాడు. ఈ సమయంలో ఎమోషనల్ అవుతూ “ఫుడ్ విషయంలో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు నా బంధువులు కారే.. అందరూ కాంపిటేటర్స్” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 ఫుడ్ రూల్స్ విషయంలో బిగ్ బాస్‌ను డైరెక్ట్‌గా రిక్వెస్ట్ చేయడం హౌస్‌లో చర్చనీయాంశమైంది. ఈ సమయంలో పవన్ అతనిని కూల్ చేయడానికి ప్రయత్నించగా, మాస్క్ మాన్ “ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే, దేవుడు వచ్చినా ఆగను” అంటూ మరోసారి షాకింగ్ కామెంట్ చేశాడు. ఇలా ఫస్ట్ డే మొత్తం మాస్క్ మాన్ తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడని చెప్పాలి. .

79
కంటెస్టెంట్లపై ప్రియా షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లంతా తమ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడకుండా ఫ్రెండ్లీగా నటిస్తున్నారని ప్రియా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె వ్యాఖ్యలకు మర్యాద మనీష్ కూడా వత్తాసు పలికాడు. ఈ సందర్భంగా ప్రియా, ఇమ్మానుయేల్, శ్రష్టి వర్మ తప్ప మిగతావారు అందరూ ఫేక్‌గా ఉన్నారని ఆరోపించింది.

89
బిగ్ బాస్ సర్ప్రైజ్ డిన్నర్

సెలబ్రిటీల కోసం బిగ్ బాస్ స్పెషల్ డిన్నర్ ను అరేంజ్ చేసి వారికి దిమ్మతిరిగే పోయే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్లు అందరూ తమకు నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో తనుజను బిగ్ బాస్ పిలిచి మీరు ఏమైనా మిస్ అవుతున్నారా అని ప్రశ్నించగా.. తాను కాఫీ మిస్ అవుతున్నానని, తనకు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, లైఫ్ అంటే కావాల్సినవన్నీ దొరకమంటూ షాక్ ఇస్తాడు. దీంతో తనుజ నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతుంది.

ఈ సమయంలో బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇస్తూ, ఓనర్స్ కు టెనెంట్స్ కు కుక్ చేయాలని ఆర్డర్ వేస్తాడు. అదే సమయంలో టెనెంట్స్ మాత్రం ఇకపై కుకింగ్ చేసే ఛాయిస్ లేదని, వారికి తానే స్పెషల్ గా పౌష్టికాహారాన్ని అందజేస్తానంటూ బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇస్తాడు. దీంతో కంటెస్టెంట్ లందరూ ఎంజాయ్ చేస్తారు.

99
మాస్క్ మాన్ vs ఇమ్మాన్యుయేల్ – గుండు కామెంట్‌పై ఘర్షణ

బిగ్ బాస్ హౌస్‌లో తొలిరోజే హీట్ పెరిగింది. మాస్క్ మాన్ హరీష్ – ఇమ్మాన్యుయేల్ మధ్య ఘర్షణ చెలరేగింది. మొదటగా ఇమ్మాన్యుయేల్, హరీష్‌ను “గుండు” అంటూ సరదాగా బాడీ షేమింగ్ చేశాడు. వెంటనే తన తప్పు గుర్తించి అందరి ముందు క్షమాపణ చెప్పాడు. అయితే మాస్క్ మాన్ మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకుని, “మాట్లాడే ముందు ఆలోచించాలి. హ్యూమర్‌కి కూడా ఒక లిమిట్ ఉండాలి” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడితో ఆగకుండా, ఇమ్మాన్యుయేల్‌ని “మీ లిమిట్స్‌లో ఉండండి” అంటూ అందరి ముందు హెచ్చరించాడు.

ఇమ్మాన్యుయేల్ మాత్రం జోక్స్ వేస్తూ తగ్గకపోవడంతో, “టైమ్‌కి తగ్గట్టు మారుతున్నారు ఏంటి బ్రదర్?” అంటూ సవాల్ విసిరాడు. దీనికి హరీష్ కౌంటర్ ఇస్తూ, “నీ పరిస్థితిని బట్టి నేను ఉండాలా?” అని ప్రశ్నించాడు. ఇంతలో ఇమ్మాన్యుయేల్ రెండోసారి కూడా సారీ చెప్పినా, హరీష్ రెచ్చిపోతూనే ఉన్నాడు. “నన్ను బాడీ షేమ్ చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ గట్టిగా రియాక్ట్ చేశాడు. ఈ ఘర్షణ మొత్తం హౌస్‌లో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. మాస్క్ మాన్ తన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్స్, ఎమోషనల్ రియాక్షన్స్‌తో తొలిరోజే వన్ మ్యాన్ షోగా నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories