Little Hearts Collections: రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది.
Little Hearts Collections: టాలీవుడ్‌లో కొన్నిసార్లు పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేవు. కానీ కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాయి. తాజాగా అదే మ్యాజిక్ చూపిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. స్టార్ హీరోలు లేకుండానే కేవలం కథా బలంతో ముందుకు వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్‌తో ముందుకు సాగుతోంది. కేవలం ఒక రోజులోనే లిటిల్ హార్ట్స్ బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండో రోజునుంచే లాభాల బాట పట్టింది.
25
మొదటి షో నుంచే పాజిటివ్ టాక్
‘90s బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా నటించగా, అతనికి జోడీగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫేమ్ శివాని నటించింది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, 90s బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రైట్స్‌ను హ్యాండిల్ చేశారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 5) లిటిల్ హార్ట్స్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూత్ మైండ్‌సెట్‌కి దగ్గరగా ఉన్న కథ కావడంతో ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా యువత, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాకు పెద్ద సపోర్ట్ ఇస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
35
ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్!
లిటిల్ హార్ట్స్’మూవీకి ఎవరు ఊహించిన విధంగా రెస్పాన్స్ వస్తుంది. యూత్ నుంచే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌లకు క్యూ కడుతున్నారు. ‘లిటిల్ హార్ట్స్’సినిమాను కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే.. థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారీ రెస్పాన్ రావడంతో ఈ చిన్న సినిమానే మొదటి రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి, సెన్సేషన్ సృష్టించింది. రెండో రోజు నుంచి లాభాల బాట పడింది. ఇంకా వీకెండ్ లో దుమ్మురేపుతుంది.
లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మూడు రోజుల్లోనే ఆరు రెట్లు వసూళ్లు సాధించింది. లిటిల్ హార్ట్స్ మొదటి రోజు రూ. 1.35 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక సెకండ్ డే కలెక్షన్ ₹2.50 కోట్లు రాబట్టగా, సండే (3rd Day) ₹3.65 కోట్లు వసూలు చేసింది.
ఇలా మూడు రోజుల్లో ( ఫస్ట్ వీకెండ్‌లో) రూ. ఏకంగా రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టగా, రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇందులో ఒక్క ఓవర్సీస్ నుంచే ₹3 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
55
చిన్న సినిమా – పెద్ద ఇన్స్పిరేషన్
మొత్తం మీద, ‘లిటిల్ హార్ట్స్’ విజయంతో చిన్న సినిమాలు కూడా కంటెంట్ ఉంటే ఎంత పెద్ద విజయం సాధించగలవో మళ్లీ నిరూపితమైంది. ఓటీటీ కోసం ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ స్టోరీగా మారింది. హైదరాబాద్, చెన్నై, వైజాగ్‌లో మంచి ఆక్యుపెన్సీ నమోదవగా, విజయవాడ, వరంగల్ లాంటి టౌన్లలో కూడా బలమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ క్లబ్ చేరే అవకాశం ఉంది.