జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సౌత్ ఇండస్ట్రీ అభిమానులు, ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె చెసిన ఈ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్న పలు పోస్టర్లు, ఫోటోలను షేర్ చేస్తూ "ఇవి సౌత్ సినిమాలే కదా, అందులో మీ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి" అంటూ ప్రశ్నిస్తున్నారు. "సూర్య భార్య అనే గౌరవంతో మేం మౌనంగా ఉన్నాం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కావు. " అని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.