రెమ్యునరేషన్ లో పవన్ కళ్యాణ్ నయా రికార్డ్: ఫస్ట్ మూవీ నుండి OG, ఉస్తాద్ భగత్ సింగ్ వరకు

Published : Sep 02, 2025, 07:59 AM IST

Pawan Kalyan Remuneration: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ తరుణంలో పవన్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నుంచి నేటి ఓజీ (OG),ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ?  

PREV
16
పవన్‌ కళ్యాణ్‌కు రికార్డ్ రెమ్యునరేషన్.

Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరులో ఏదో తెలియని వైబ్రేషన్. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ముందు నుంచే బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. వాస్తవానికి పవర్ స్టార్ ఫాలోయింగ్ కు హిట్లు.. ప్లాపులతో సంబంధం ఉండదు. పవర్ స్టార్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. 1996లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయమ్యారు. తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు పవర్ స్టార్ గా ఎదిగారు. అలా ఆనాటి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నుంచి నేటి ఓజీ (OG),ఉస్తాద్ భగత్ సింగ్ వరకు రెమ్యూనరేషన్ విషయంలో నయా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

26
పవన్ తొలి సినిమాల రిమ్యూనరేషన్

పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా వెండితెరకు అడుగుపెట్టారు. ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ నెలకు కేవలం ₹5,000 అందుకున్నారట. ఇలా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే వరకు పవన్ కళ్యాణ్ కేవలం రూ. 50,000 మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట.

 పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి వారసత్వం తీసుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొట్ట మొదటి హీరో. తన ప్రత్యేక ఇమేజ్, ప్రతిభతో పవర్ స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు.

36
అటు రాజకీయం.. ఇటు సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో ఒకరు. మిగిలిన హీరోలకు ఫ్యాన్స్ ఉంటే, పవన్ కళ్యాణ్‌కు భక్తులు ఉన్నారని చెబుతారు. ఈ ఫ్యాన్స్ కు హిట్స్.. ప్లాప్స్ తో సంబంధం లేదు. అంతా డై హార్ట్ ఫ్యాన్సే. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో కొత్త రికార్డ్ సృష్టించేందుకు దూసుకెళ్తున్నారు. 

ఏపీ రాజకీయాల్లో అయినప్పటికీ, సమయం దొరికినప్పడల్లా సినిమాలు చేస్తున్నారు. తన అభిమానుల్లో పుల్ జోష్ ను నింపుతున్నారు. ఇటీవల ‘హరిహర వీరమల్లు’సినిమాతో ప్రేక్షకుల ముందు రాగా, అతి త్వరలో ఈ నెల చివరిలో ‘ఓజీ’ సినిమాతో మెగా ఫ్యాన్స్ లో పుల్ జోష్ నింపనున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

46
ఓజీకి పవన్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

OG’ సినిమా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి హిట్ సినిమాల తర్వాత వచ్చిన ఈ మూవీ, టైటిల్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. OG కోసం రికార్డుల స్థాయిలో బిజినెస్ జరిగి, సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 

ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. శ్రియా రెడ్డి, వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ను సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, పవన్ కళ్యాణ్ ₹100 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నట్టు టాక్.

56
పాన్ ఇండియా స్టార్స్ కు ధీటుగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) రెమ్యూనరేషన్ విషయంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ అక్షరాలా రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. 

ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్‌లు వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ పొందినప్పటికీ, ప్రాంతీయ భాషా సినిమాకు ఏకంగా రూ. 172 కోట్లను అందించడం రికార్డు అనే చెప్పాలి.

66
టాలీవుడ్ లో నయా రికార్డు.

ఈ వార్త నిజమైతే, టాలీవుడ్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డ్ సృష్టించనున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, రిలీజ్ అయ్యే వరకు ఈ రెమ్యూనరేషన్ నిజానిజాలు తేలనున్నాయి. 

పవన్ OG తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ₹172 కోట్ల రెమ్యూనరేషన్‌లో ఎలా వర్కౌట్ అవుతుందో టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పవన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. అభిమానులు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories