ఇదే నా చివరి సినిమా.. స్టార్ డైరెక్టర్‌ సంచలన నిర్ణయం

Published : Sep 02, 2025, 08:57 AM IST

Vetrimaaran: తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు వెట్రిమారన్ తన సొంత నిర్మాణ సంస్థ క్రాస్ రూట్స్ ఫిల్మ్ కంపెనీ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అసలేం జరిగింది?  

PREV
15
డైరెక్టర్‌ వెట్రిమారన్ సంచలన నిర్ణయం

తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసురన్‌, పొల్లధవన్‌, వడ చెన్నై, విడుదలై వంటి చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన. దర్శకుడిగా రాణిస్తూ సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ కూడా నడిపిస్తున్నారు. గ్రాస్ రూట్ ఫిల్మ్ బ్యానర్ ద్వారా పలు సినిమాలు నిర్మించారు. తాజాగా బ్యాడ్ గర్ల్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ డైరెక్టర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటీ? కారణమేంటీ?

25
ప్రత్యేక గుర్తింపు

2007లో పొల్లాధవన్ సినిమాతో వెట్రిమారన్ తమిళ చిత్ర పరిశ్రమలోకి దర్శకత్వం ద్వారా అడుగు పెట్టారు. సామ్యానుల జీవితాల్లో కష్టాలను తెరకెక్కించడంలో మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యారు. బెస్ట్ డైరెక్టర్ గా వెట్రిమారన్ ప్రశంసలు అందుకున్నారు. అందులో తర్వాత, ఆడుకాలం, ఇనారి, వడ చెన్నై, అసురన్, విదుతి భాగం ఒండ్రు, విదుతి భాగం ఈతు వంటి సినిమాలతో వెట్రిమారన్ తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. తమిళ దర్శకుడు వెట్రి మారన్ తీసిన 'విడుదల' సినిమా తెలుగు ప్రేక్షకులనూ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత ధనుష్ హీరోగా ఆయన తీసిన 'అసురన్' సినిమాను తెలుగులో 'నారప్ప'గా రీమేక్ చేశారు. ఇలా విభిన్న కథాంశాలతో స్పెషల్ మార్క్ సినిమాలను తీయడంతో వెట్రిమారన్ మేటీ అనే చెప్పాలి.

35
మూవీ ప్రొడక్షన్ లోనూ

వెట్రిమారన్ దర్శకుడిగా కొనసాగుతూనే 2012లో క్రాస్ రూట్స్ ఫిల్మ్ కంపెనీ ( Grass Root Film Company) అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఉదయమ్ NH4, పోరియాలన్, కాకా ముట్టై, ఇనారి, కోడి, అన్నంకు జై, వడ చెన్నై వంటి చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం బ్యాడ్ గర్ల్ (Bad Girl) సినిమాను కూడా నిర్మించారు. 

వర్ష భారత్ దర్శకత్వంలో రూపొందిన బ్యాడ్ గర్ల్ సినిమాలో అంజలి శివరామన్, శాంతి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన టీజర్ వివాదాలను తలెత్తించగా, సినిమాను రివైజింగ్ కమిటీకు పంపి, చివరికి U/A సర్టిఫికేట్ పొందారు. పిల్లలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.

45
సంచలన నిర్ణయం

తాజా పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్ వెట్రిమారన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన నిర్మాణ సంస్థ ‘క్రాస్ రూట్స్ ఫిల్మ్ కంపెనీ’ (Grass Root Film Company) ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా నిర్మాణం సవాళ్లతో కూడుకున్నది, డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ. 

బ్యాడ్ గర్ల్ మూవీ వారి నిర్మాణ సంస్థ చివరి చిత్రం అవుతుందని స్పష్టంచేశారు. వెట్రిమారన్ దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాతగా సినిమాలను నిర్మించడం సరికాదనీ, ప్రొడక్షన్ ను పూర్తిగా వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆయన డైరెక్షన్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

55
డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

డైరెక్టర్ వెట్రిమారన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ, “నిర్మాతగా ఉండటం టాక్సింగ్ జాబ్‌ లాంటిది. దర్శకుడిగా సృజనాత్మక పని చేసుకోవచ్చు, ఒత్తిడి లేదు. కానీ, నిర్మాత అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చివరగా టీజర్ కింద వచ్చే కామెంట్స్, నటీనటులు, ప్రకటనలు కూడా వ్యాపారంపై ప్రభావం చూపుతాయి. అది చాలా ఒత్తిడిగా ఉంటుంది. చిన్న నిర్మాతకు ఈ రంగంలో మనుగడ కష్టం. అందుకే మా నిర్మాణ సంస్థను మూసివేస్తున్నాం” అని తెలిపారు. బ్యాడ్ గర్ల్ సినిమాకు సెన్సార్ బోర్డుతో కూడా పోరాటం ఎదుర్కొన్నారట.

Read more Photos on
click me!

Recommended Stories