ఆయనతో సినిమాచేయడం కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతూనే ఉన్నారు. పోటీపడుతూనే ఉన్నారు. ఇక ఇండియా లోనే కాకుండా ప్రభాస్ కు బాహుబలి సినిమా వల్ల ఇతర దేశాల్లో కూడా డైహార్ట్ ఫ్యాన్స్ పెరిగిపోయారు. మరీ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే జపాన్, చైనాలాంటి దేశాల్లో ప్రభాస్ క్రేజ్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
ప్రభాస్ ను చూడటం కోసం చాలామంది ఇండియాకు వచ్చిన సంఘటనలుకూడా ఉన్నాయిన ప్రభాస్ ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. అయితే ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి చాలామంది పాన్ఇండియా స్టార్స్ బయటకు వచ్చారు. వారు కూడా విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగారు.
Also Read: ధనుష్ - ఐశ్వర్య విడాకుల కేసు: కోర్టు తీర్పు ఏంటి? జడ్జి ఏమన్నారంటే..?