రెహమాన్, సైరా బాను
ఎ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఆయన తన భార్య సైరా బాను తో విడాకుల విషయంలో వైరల్ అవుతున్నారు. వీరిద్దరు దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. 29 ఏళ్లుగా కలిసి ఉన్న ఈ జంటకి ముగ్గురు పిల్లలు. వారి న్యాయవాది వందనా షా విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా వారు తమ విడిపోవడాన్ని ప్రకటించారు. అయితే, వందనా ప్రకటన ప్రకారం, విడాకుల ఆర్థిక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు.
Also Read: ధనుష్ - ఐశ్వర్య విడాకుల కేసు: కోర్టు తీర్పు ఏంటి? జడ్జి ఏమన్నారంటే..?
ఎ.ఆర్. రెహమాన్
ఎ.ఆర్. రెహమాన్ హిందువుగా పుట్టారు. తండ్రి మరణం తర్వాత ఇస్లాం మతంలోకి మారారు. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తన పేరు మార్చుకోవాలని చాలా కాలంగా కోరుకున్నారు. 'రెహమాన్' అనే పేరుతో తనకు చాలా దగ్గరి అనుబంధం ఉంది అని ఆయన భావించేవారు. అందుకే . తండ్రి మరణం తర్వాత కుటుంబంతో ఇస్లాం మతంలోకి మారడంతో, చాలా కాలంగా తాను కోరుకున్న 'రెహమాన్' అనే పేరును ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
Also Read: అమల తల్లి ఏదేశానికి చెందిన మహిళ, అమల ఇండియన్ కాదా..? నిజమేంటంటే..?
ఎ.ఆర్. రెహమాన్
"దేవునిచే కాపాడబడ్డవాడు" అని అర్థం వచ్చే ఎ.ఆర్. రెహమాన్ పేరు నేడు సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగింది. మ్యూజిక్ ప్రియులను ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది. ఈ పేరు మార్పు రెహమాన్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న కీర్తిని సూచిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సంగీతకారులలో ఒకరిగా ఆయన స్థానాన్ని పదిలపరుస్తుంది.