వరుణ్ తేజ్ ‘మట్కా’ OTT : ఎంతకు అమ్మారు, ఏ ప్లాట్ ఫామ్, ఎప్పుడు వస్తుంది

First Published | Nov 21, 2024, 4:42 PM IST

వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' సినిమా నవంబర్ 14న విడుదలైంది. ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 15 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా త్వరలో ఓటిటిలో విడుదల కానుంది.

Varun Tej, Matka , Gangster Film, OTT


 వరుణ్ తేజ్ (Varun Tej)తాజా చిత్రం ‘మట్కా’ (Matka) సినిమా నవంబర్ 14న రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ’పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించింది.

నోరా ఫతేహి (Nora Fatehi) కూడా కీలక పాత్ర పోషించింది. రిలీజ్ కు ముందు ‘మట్కా’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.  టీజర్, ట్రైలర్స్ లో డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే రిలీజ్ రోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ ఎంతకు అమ్మారు. ఏ ఓటిటిలో రాబోతోంది, ఎప్పుడు రావచ్చు వంటి విశేషాలు చూద్దాం.
 


వరుణ్ తేజ ఫ్లాఫ్ ల నుంచి తప్పించుకోవాటనికి కొత్త సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో  ఇప్పుడు మట్కా కింగ్ రతన్ ఖేత్రీ స్ఫూర్తితో అల్లిన కథతో మన ముందుకు వచ్చాడు. అయితే సినిమా అనుకున్న స్దాయిలో లేదు.

వరుణ్ తేజ్ కెరీర్ కు కొత్త వెలుగు ఇస్తుందనుకున్న ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.  ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా అనుకున్నదాని కంటే ముందే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
 

Latest Videos



అందుతున్న సమాచారం మేరకు అమేజాన్  ప్రైమ్ ఓటిటి వారు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని 15 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. బడ్జెట్ తో పోలిస్తే ఈ రేటు తక్కువే. అయితే వరణ్ తేజ మార్కెట్ గత కొద్ది కాలంగా బాగోకపోవటంతో ఈ తక్కువ రేటుకు వెళ్లింది.

ఇక ఈ చిత్రం రిలీజైన మూడు వారాల్లో లోగా ఓటిటిలోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరకు కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ఓటిటిలో ప్రత్యక్ష్యమవ్వచ్చు అని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 


  ఈ చిత్రం థియేటర్ రైట్స్  ₹20 కోట్లవరకూ అమ్ముడయ్యాయి. కానీ రికవరీ మాత్రం 3% మాత్రమే ఉంది. సినిమా బడ్జెట్  ₹50 కోట్లు దాటిందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రేడ్ ఈ సినిమాని భారీ డిజాస్టర్ గా అభివర్ణిస్తోంది.

ఇప్పటిదాకా వచ్చిన షేర్ చూస్తే థియేటర్ మెయింటినెన్స్  ఖర్చులు కూడా వచ్చేలా లేవు అంటున్నారు. క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ 1 కోటి దగ్గరే ఆగిపోయేలా కనపడుతోంది.  సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. రెండో రోజు నుండి ఏమైనా హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. 

Varun Tej, Kanaka Raju, Merlapaka Gandhi


  చిత్రం కథ విషయానికి వస్తే... కథా కాలం 1958- 1982 మధ్య నడుస్తుంది.  బర్మా నుంచి శరణార్ది వాసు (వరుణ్ తేజ్) చేసిన అనుకోని పరిస్దితుల్లో చేసిన ఓ హత్య వల్ల బాల ఖైదిగా జైల్ కు వెళ్తాడు. అక్కడే బాల్యం పూర్తి చేసుకుని  యుక్తవయసు వచ్చాక జైల్లోంచి బయట ప్రపంచంలోకి వస్తాడు.

జైలులో తనకు అయిన పరిచయాలు, తనలోని అసలు నైజం కలిపి ఓ మొరటు వ్యక్తిగా తయారవుతాడు. రౌడీయిజం ని తన వృత్తిగా ఎంచుకుంటాడు.  బ్రతుకుతెరవు కోసం మొదట్లో విశాఖలో కూలీ గా ప్రయాణం మొదలెట్టినా షార్ట్ పీరియడ్ లో ఎదిగిపోవాలనే ఆలోచన అతని మెదుడ్ని తొలిచేస్తుంది.


దాంతో  తెలివిన  వాసు గ్యాంబ్లింగ్ లోకి ఎంటరవుతాడు. మట్కాని ప్రవేశపెట్టి అంచలంచలుగా మట్కా కింగ్ గా ఎదుగుతాడు.  ఆ క్రమంలో అతనికి  నానినాబు (కిషోర్) లాంటి వాళ్లు సాయిపడితే  కెబి (జాన్ విజయ్) లాంటి రౌడీలు వాళ్ళు శతృవులు అవుతారు. కెబికు ఒకటే జీవితాశయం  తన రౌడీయిజానికి ఎదురొచ్చిన   వాసుని చంపాలని. ఇక వాసు పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే... వాసుకి ఒక వేశ్య (సలోని) చెల్లెలు (మీనాక్షి) పరిచయమవుతుంది. అది మెల్లిగా ఇద్దర్నీ ఒకటి చేస్తుంది. 

ఇక గ్యాంబ్లర్ గా తన “మట్కా” సామ్రాజ్యాన్ని వాసు దేశమంతా ఎలా విస్తరింపజేస్తూంటే సీబీఐ కన్ను అతనిపై పడుతుంది. వారి నుంచి ఎలా  వాసు తప్పించుకున్నాడు.  సీబీఐ అధికారి సాహు (నవీన్ చంద్ర) అతన్ని పట్టుకోవటానికి వల విసురుతాడు. అప్పుడు ఏమైంది. మట్కా కింగ్ గా ఎదిగిన అతని జీవితం చివరకు ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

click me!