చాలా లోకేషన్లు తిరిగిన తరువాత ప్రశాంత్ నీల్ తో పాటు ఆయన టీమ్ కు కుమ్టాలోని ధారేశ్వర రామనగిండి లో షూటింగ్ లొకేషన్ దొరికింది. విశాలమైన సముద్ర తీరం, పక్కనే పచ్చని కొండలు, జనసందోహం లేని ప్రశాంతమైన ప్రదేశంలో షూటింగ్ కు రెడీ అయ్యారు టీమ్.
ప్రశాంత్ నీల్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీకి, షూటింగ్ లొకేషన్ దొరికింది. కర్నాటకలోని కుమ్టా ధారేశ్వర సమీపంలోని రామనగిండి సముద్ర తీరంలో వారు స్టే చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ ఉత్తర కన్నడ సముద్ర తీరంలో జరుగుతోంది.
నిర్మానుష్యంగా ఉన్న రామనగిండి సముద్ర తీరంలో ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మించారు. పెద్ద తుపాకులు, ఇల్లు, హెలికాప్టర్, రైలు సెట్లు వేశారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా షూటింగ్ జరుగుతోంది. ఇంకా చాలా రోజులు ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఎన్నో ప్రదేశాలు వెతికిన తర్వాత ప్రశాంత్ నీల్ బృందానికి కుమ్టా ధారేశ్వర రామనగిండి బాగా నచ్చింది. విశాలమైన సముద్ర తీరం, పక్కనే పచ్చని కొండలు, జనసందోహం లేని ప్రశాంతమైన ప్రదేశం ఇది. ఈ కొండ కిందనే ఇప్పుడు భారీ సెట్ వేశారు.
సుమారు ఒక నెల నుండి ఇక్కడ సెట్ వేసే పని జరుగుతోంది. ఇప్పుడు షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు టీమ్. ఇక ఈసినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్ తో పాటు రెండు పాటల షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుందని సమాచారం.
ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ గత ఐదు నెలల్లో 18 కిలోల బరువు తగ్గి పాత్రకు సిద్ధమయ్యారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మిడ్ వరకూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.