తినడానికి తిండి లేక పస్తులున్నా, జబర్దస్త్ చమ్మక్ చంద్ర నవ్వుల వెనుక విషాద కథ

వెండితెరపై  స్టార్లుగా వెలుగుతున్న వారిలో చాలామంది  జీవితంలో కష్టాలు చూసిన వారే. కెరీర్  బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చినవారే. ఎంత స్థాయికి ఎదిగినా.. వారు గతం గురించి గుర్తు చేసుకోకుండా ఉండలేరు. అటువంటి వారిలో చమ్మకు చంద్ర కూడా ఒకరు. జబర్థస్త్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ కమెడియన్ గా మారాడు చంద్ర, సినిమా అవకాశాలు కూడా సాధించాడు. ఇక  కెరీర్ లో తాను పడిన కష్టాలు అనుభవించిన బాధల గురించి  ఓ సందర్భంలో వెల్లడించారు చంద్ర.  

Chammak Chandra Real Life Struggles Before Jabardasth Fame in telugu jms

బుల్లితెరపై చిన్నస్థాయి నుంచి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు చమ్మకు చంద్ర. ప్రస్తుతం వరుస అవకాశాలతో  హాస్య నటుడిగా బిజీ అయిపోయాడు చమ్మక్ చంద్ర, జబర్దస్త్'తో పాపులర్ అయిన చంద్ర.. ప్రస్తుతం కంప్లీట్ గా సినిమాలపైనే  ఫోకస్ పెడుతూ వచ్చాడు. అయితే చంద్ర ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు. రీసెంట్ గా చంద్ర  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

chammak chandra

చంద్రా మాట్లాడుతూ..మాది చాలా పేద కుటుంబం.. హైదరాబాద్ వచ్చిన తరువాత ఇంటి నుంచి ఏదో  పంపిస్తారనే ఆశ లేదు. అందువలన సిటీలో నా కష్టాలు నేను పడేవాడిని, అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు తిని తినక చాలా కష్టాలు అనుభవించాను. జబర్దస్త్'కి ముందు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తున్నా కష్టాలు తీరలేదు. అప్పట్లో కేజీ బియ్యం 10 రూపాయలు ఉండేవి. అందువలన నేను ఆ 10 రూపాయలతో 3 కేజీల నూకలు కొనుక్కునే వాడిని. ఆ మూడు కేజీలు పొదుపుగా వాడుకునేవాడిని అన్నారు. 


ఇక ఆ కష్టాలు పడలేక ఒక్కోసారి మా ఊరుకు వెళ్లిపోదామని అనిపించేది. కానీ ఊళ్లో వాళ్లు  వెక్కిరిస్తారని భయం వేసింది, పట్టుదల పెరిగింది. అందుకే ఆ పనిచేయలేకపోయాను.  ఆ అవమానం కంటే ఇక్కడ ఇబ్బందులే బెటర్ అనుకునేవాడిని" అలానే నెట్టుకొస్తూ.. చిన్న చిన్న వేశాలు వేసుకుంటూ కాలం గడిపాను అని అన్నారు చంద్ర. 

" ఇండస్ట్రీలో నాకు తెలిసినవాళ్లెవరూ లేరు. ఎవరైనా ఎంకరేజ్ చేస్తారో లేదో కూడా తెలియదు. అయినా మొండిగా వచ్చేశాను. జేబులో డబ్బులు లేకపోయినా నిరాశపడకుండా ప్రయత్నాలు చేశాను. ఒకసారి వెనక్కి వెళితే నేనేనా ఇన్ని కష్టాలు పడింది .. నేనేనా ఇక్కడివరకూ వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పడిన కష్టాలు ఇప్పుడు నాకు చాలా గొప్ప జ్ఞాపకాలుగా అనిపిస్తున్నాయి. నేను అనుకున్నది కొంతవరకూ సాధించగలిగాననే సంతోషం ఉంది" అని చంద్ర అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు.  

Latest Videos

vuukle one pixel image
click me!