పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో

Published : Apr 28, 2025, 07:37 AM IST

పాకిస్తాన్ పై రెచ్చిపోయారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన విజయ్ టెర్రరిస్ట్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్త ఘాటు పదాలు వాడుతూ వార్నింగ్ కూడా ఇచ్చాడు రౌడీ హీరో. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నారు?    

PREV
15
పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో

విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది. టెర్రరిస్ట్ లను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను తిట్టకుండా ఉండలేకపోయాడు విజయ్. ఇండియాలో  అరాచకం సృష్టిస్తున్నవారిపై బూతులతో రెచ్చిపోయాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా జరిగిన సినిమా ఈవెంట్ లో హాట్ హాట్ కామెంట్స్ చేశాడు విజయ్. సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్ లో విజయ్ దేవరకొండా ఈ వ్యాఖ్యలు చేశారు. 
 

Also read: పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్

25

కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రెట్రో. ఈ తమిళ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈమూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది మూవీ.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను స్పీడ్ చేశారు టీమ్. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Also read: సచిన్ కూతురు తో డేటింగ్ వార్తల పై, ఫస్ట్ టైమ్ స్పందించిన శుభ్ మన్ గిల్, స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

35

 ఈ క్ర‌మంలో ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ  విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఒక ఇంట్రెస్టింగ్ ర ప్ర‌శ్న అడిగింది. టైమ్ మెషిన్ సహాయంతో రెట్రో రోజుల్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారు.. ఎవరిని కలుస్తారు అని ఆమె అడిగింది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ విషయంలో  స్పందిస్తూ.. నాకు అలాంటి అవకాశం వస్తే.. ముందు  బ్రిటీష్ కాలంలోకి వెళ్ళి  వాళ్ల‌ని క‌లిసి రెండు పీకాల‌ని అయితే ఉంది. ఛావా సినిమా చూశాక కోపం మాములుగా రాలేదు. అందుకే ముందు కోటింగ్ వారికే ఇస్తాన్నారు. 

Also read:స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?

45
Vijay Devarakonda,

ఇక ఆతరువాత కాస్త ఘాటుగా మాట్లాడారు విజయ్.  ఔరంగజేబు గాడిని కూడా గట్టిగా రెండు మూడు వేసుకోవాలని ఉంది. అలా చాలామందిని కలవాలని ఉంది. మంచోళ్ళను ఇబ్బంది పెట్టినవారిని కొట్టాలని అనిపిస్తుంది అని అన్నారు. రీసెంట్ గా కాశ్మీర్‌లో చాలా జరిగాయి..  అవన్నీ ఆగిపోయవాలి. సరైన చదువు లేకపోవడంతో వారు అలా బిహేవ్ చేస్తున్నారు. ఆ నా కొడుకుల‌కి ప్రాపర్‌గా ఎడ్యుకేష‌న్ చెప్పించి. ఇలా బ్రెయిన్ వాష్ కాకుండా వాళ్లకు మంచి చేయడం నేర్చించాలని ఉంది అన్నారు. 

55
Vijay devarakonda

పాకిస్తాన్ పై ఫైర్ అయ్యారు విజయ్..  ఇప్పుడు నేను చెబుతున్నాను. కశ్మీర్ ఇండియాదే. వాళ్లు ఇండియన్స్.  ఖుషీ సినిమా షూటింగ్  కోసం అక్క‌డికి వెళ్లిన‌ప్పుడు నన్ను టా టీమ్ ను వాళ్లు చాలా బాగా ర రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నాకు  మంచి మెమోరీస్ ఉన్నాయి. ఇక  పాక్ వాళ్లు వాళ్ల జనాలనే చూసుకోలేకపోతున్నారు. ఇక కాశ్మీర్ ను తీసుకుని ఏం చేస్తారు అని అన్నారు.

పాకిస్తాన్ లో  సరిగ్గా కరెంట్ లేదు , తిండి లేదు, ఈరకంగా చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన ప‌ని లేదు. వాళ్ల‌కే విర‌క్తి వ‌చ్చి వాళ్ల గ‌వ‌ర్న‌మెంట్‌పైన అటాక్ చేసే రోజు త‌ప్ప‌క వ‌స్తుంది. ఇలానే కంటిన్యూ అయితే క‌చ్చితంగా అది జ‌రుగుతుంది అంటూ విజయ్ దేవ‌ర‌కొండ కాశ్మీర్ ఇష్యూపై సీరియ‌స్ అయ్యారు. ఇక 15 ఏళ్ల త‌ర్వాత సూర్య‌తో స్టేజ్ పంచుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని విజయ్  అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories