జయసుధతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్‌ హీరో ఎవరో తెలుసా? తెలిసి తెలిసీ అలా చేయడం కష్టమే

Published : Feb 26, 2025, 01:43 PM ISTUpdated : Feb 27, 2025, 12:10 PM IST

Jayasudha: జయసుధతో రొమాన్స్ చేయడానికి స్టార్‌ హీరో ఇబ్బంది పడ్డాడా? బలవంతంగా ఇద్దరు ఎందుకు కలిసి నటించాల్సి వచ్చింది. అసలేం జరిగింది.  

PREV
15
జయసుధతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్‌ హీరో ఎవరో తెలుసా?  తెలిసి తెలిసీ అలా చేయడం కష్టమే
jayasudha

Jayasudha: జయసుధని తెలుగు తెర సహజ నటిగా పిలుచుకుంటారు. ఆమె సహజమైన నటనతో విశేష ప్రేక్షకులను అలరించారు, ఆకట్టుకున్నారు. యాభై ఏళ్లుగా ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నారు. 230కిపైగా చిత్రాల్లో నటించారు. సీనియర్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది.

బాల నటిగా చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా చేసింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటివారితోనూ కలిసి నటించింది. వారికి హిట్‌ పెయిర్‌గానూ నిలిచింది.  
 

25
jayasudha

జయసుధ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒకటి అర మూవీస్‌లో మెరుస్తుంది. చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. బలమైన పాత్రలు ఉంటేనే చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు తల్లి పాత్రల్లోనే మెరుస్తుంది జయుసుధ. అయితే జయసుధ అందరితోనూ ఈజీగా మూవ్‌ అవుతుంది. ఏ హీరో అయినా ఇట్టే కలిసిపోతుంది.

వారితో మంచి కెమిస్ట్రీ పండిస్తుంది. కృష్ణంరాజుతో ఎక్కువ సినిమా చేసి ఇయనకు హిట్‌ పెయిర్‌గా నిలిచారు. కానీ ఓ హీరోతో మాత్రం నటించడానికి ఇబ్బంది పడిందట. దాదాపు ముప్పై సినిమాలు చేసినా ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉండేదట. ముఖ్యంగా ఆ హీరో బాగా ఇబ్బంది పడ్డాడట. 

35
సూపర్‌ స్టార్‌ కృష్ణ

ఆ హీరో ఎవరో కాదు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన జయసుధతో నటించడానికి బాగా మొహమాటం పడేవాడట. సెట్‌లో ఇబ్బందిగా ఫీలయ్యేవాడట. షూటింగ్‌లో కంఫర్ట్ గా ఉండేవాడు కాదట. కారణం ఏంటనేది చూస్తే జయసుధ.. కృష్ణకి రిలేటివ్‌ అవుతుంది.

విజయ నిర్మలకు జయసుధ మేనకోడలు. దీంతో కృష్ణకి కూడా కోడలే అవుతుంది. తరచూ ఇంటికి వస్తుంటుంది. చిన్నప్పట్నుంచి కృష్ణ ఆమెని చూశాడు. పైగా ఓ మూవీలో తనకు కూతురుగా కూడా నటించింది. అలాంటి నటితో తాను కలిసి ఎలా నటించేది అనేవాడట. 
 

45
jayasudha, krishna

కూతురులాంటి అమ్మాయితో రొమాన్స్ చేయడం ఎలా అని అనేవాడట. ఆమెతో పాటలల్లోగానీ, ఇతర ఇంటిమేట్‌ సీన్లలోనూ చాలా డిస్‌ కంఫర్ట్ గా ఫీలయ్యేవాడట. కానీ తప్పలేదని, నటించాల్సి వచ్చిందని జయసుధనే తెలిపారు.

ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణనే కాదు, తాను కూడా ఇబ్బందిగా ఫీలయ్యేదాన్ని అని చెప్పింది జయసుధ. సెట్‌లో కృష్ణ చాలా తక్కువ మాట్లాడతాడని, ఏదైనా అడిగితే తలూపడం చేస్తాడని, అవసరమైతే తప్ప మాట్లాడరు అని చెప్పింది సయసుధ. 

read more: ఆ హీరోయిన్‌ నడుముని చూస్తే ఏఎన్నార్‌ ఏజ్‌ 25 అయిపోతుందా? అక్కినేని చిలిపి పనులు బయటపెట్టిన సీనియర్‌ నటి
 

55
jayasudha

మరి కృష్ణ, జయసుధ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు చూస్తే, `పండంటి కాపురం`, `మండే గుండెలు`, `పెళ్లాల రాజ్యం`, `పోరాటం`, `ఊరంతా సంక్రాంతి`, `మహా సంగ్రామమ్‌`, `పల్నాటి సింహం`, `ఇద్దరు దొంగలు`, `దొరగారికి దొంగ పెళ్లాం`, `బంగారు కాపురం`, `రాజకీయ చదరంగం`, `మహా మనిషి`, `డాక్టర్‌ సినీ యాక్టర్‌`, `యుద్ధం`, `అమయకుడు కాదు అసాధ్యుడు`, `అందరికి మొనగాడు`, `శక్తి`, `నేరము శిక్షణ`వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. చాలా వరకు మంచి విజయాలను అందుకున్నారు. 

read  more:ప్రభాస్‌ మరో సంచలన మూవీకి ఫస్ట్ స్టెప్‌.. కరెక్ట్ గా పడితే రెండు వేల కోట్ల కలెక్షన్లు జుజూబీ!

also read: ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కాదు అత్యధిక పారితోషికం తీసుకున్న తొలితరం హీరో ఎవరో తెలుసా? వేల కోట్లకు అధిపతి
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories