Sanam Teri Kasam Re-Release Box Office Collection: "సనమ్ తేరి కసమ్" సినిమా రీ-రిలీజ్‌లో ఎవరూ ఊహించని విధంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
రీ-రిలీజ్‌లో `సనమ్ తేరి కసమ్` సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ కలెక్షన్‌లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.
28
`సనమ్ తేరి కసమ్` రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
`సనమ్ తేరి కసమ్ మొదట 2016లో విడుదలైంది. రూ.15 కోట్ల బడ్జెట్‌లో ఈ సినిమాకు ఆదరణ దక్కలేదు. కేవలం రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అప్పట్లో ఇది పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది.
38
సనమ్ తేరి కసమ్ రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
అదే సినిమా 9 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 7న రీ-రిలీజ్ చేశారు. ఇటీవల విడుదలై ఆకట్టుకుంటుంది. బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది.
48
`సనమ్ తేరి కసమ్` రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
మొదటి రోజే 5.14 కోట్లు వసూలు చేయడంతో చిత్ర బృందం ఆశ్చర్యపోయింది. రెండో రోజు వసూళ్లు 9.5 కోట్లకు పెరిగాయి. 2016లో వచ్చిన వసూళ్లను దాటేసింది.
58
`సనమ్ తేరి కసమ్` రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
బాక్సాఫీస్ వసూళ్లు పెరిగి మొదటి వారంలో 30.67 కోట్లు వసూలు చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రూ.50 కోట్లు దాటిందని తెలుస్తోంది. ఈ కలెక్షన్లని చూసి మేకర్స్ షాక్ అవుతున్నారు. అప్పుడు డిజాస్టర్‌గా నిలిచిన మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కావడంతో ఆశ్చర్యపోతున్నారు. రీ రిలీజ్‌లో ఇదే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలవడం విశేషం.
68
`సనమ్ తేరి కసమ్` రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
ఈ సినిమాలో స్పెషల్ ఏముంది? హీరో హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ మౌరా హోకేనే ఇద్దరూ కొత్త వాళ్లే. అయినా రీ-రిలీజ్ చేసినప్పుడు వసూళ్లు రాబడుతోంది.
78
సనమ్ తేరి కసమ్ రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
`సనమ్ తేరి కసమ్` రీ-రిలీజ్ చేసినప్పుడు సవాలు ఎదురైంది. క్రిస్టోఫర్ నోలన్ ‘ఇంటర్స్టెల్లార్’ వంటి సినిమాలు విడుదలైనప్పటికీ, పోటీని తట్టుకుని నిలబడింది.
88
సనమ్ తేరి కసమ్ రీ-రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్
తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ విడుదలయ్యే సినిమాకు ఎక్కువ ఆదరణ రావడానికి ప్రధాన కారణం కొత్త ప్రేమ కథలకు కొరత ఏర్పడటమే. బాలీవుడ్ లో వరుస యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. మంచి ప్రేమ కథా చిత్రాలు లేవు. పైగా ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా మంచి సినిమాలు రాలేదు. దీంతో ఆ లోటుని `సనమ్ తేరి కసమ్` ఫిల్ చేసింది. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.