జయసుధ వెల్లడించిన అసలు నిజం
టాలీవుడ్‌లో ఒకప్పుడు అచ్చతెలుగు హీరోయిన్ల హవా ఎంతగా నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సావిత్రి, శారద, జమున, విజయనిర్మల నుంచి జయసుధ, జయచిత్ర, రంభ, రాశీ, లయ వరకు ఎంతో మంది టాప్ హీరోయిన్లు తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలను ఏలారు. ఈ క్రమంలో హీరోయిన్ల మధ్య సహజంగానే పోటీ వాతావరణం ఉండేది. కాని అది సినిమాల వరకే పరిమితం అయ్యేది.
కొన్ని కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల మధ్య మనస్పర్ధలు, గొడవలు సాధారణంగానే జరుగుతుండేవి. కాని అవి పబ్లిక్ గా గొడవపడే స్థాయికి వచ్చిన సందర్బాలు చాలా తక్కువ. ఇటువంటి ఓ సంఘటన గురించి ఆకాలం హీరోయిన్, సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ, ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన కెరీర్‌కు సంబంధించి ఆమె బయటపెట్టిన ఆ ఆసక్తికర విషయం తెగ వైరల్ అయ్యింది.