పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తోన్న `హరి హర వీరమల్లు` మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఎంత వసూళ్లు చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
`హరి హర వీరమల్లు` మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ సీన్లు, విజువల్స్ సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ సినిమాని తన భుజాలపై నడిపించారు.
డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్నా, సినిమా కోసం తన డెడికేషన్, కమిట్ మెంట్ ఇందులో కనిపిస్తుంది. అయితే సినిమా డిలే కావడం వల్ల వాటి తాలుకూ ప్రభావం సన్నివేశాల్లో కనిపిస్తోంది.
25
పవన్ కళ్యాణ్ ఎంట్రీతో `హరి హర వీరమల్లు`పై హైప్
ఇదిలా ఉంటే సినిమాకి ప్రారంభంలో అంతగా బజ్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత మూవీకి హైప్ పెరిగింది. ఇండియా వైడ్‌గా డిస్కషన్ పాయింట్ గా మారింది. దీంతో అది సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ పరంగా హెల్ప్ అయ్యింది.
భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి. అదే సమయంలో ప్రీమియర్స్ కి కూడా అది కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రీమియర్స్, ఫస్ట్ డే బుకింగ్స్ ని బట్టి చూస్తుంటే భారీగా ఓపెనింగ్స్ రాబోతున్నట్టు సమాచారం.
35
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్
తాజాగా `హరి హర వీరమల్లు` మొదటి రోజు ప్రిడిక్షన్స్ వచ్చేశాయి. ప్రీమియర్స్ షోకి సంబంధించిన క్లారిటీ వచ్చింది. ఇక గురువారం బుకింగ్స్ ని బట్టి మరింత క్లారిటీ వస్తోంది. ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టబోతుందట.
అంతేకాదు చాలా మంది ఇతర హీరోల ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డులు బ్రేక్ కాబోతున్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
`హరి హర వీరమల్లు` మూవీ ఫస్ట్ డే ప్రిడిషన్స్(అంచనా) చూస్తే, ఈ సినిమా సుమారు రూ.70-80 కోట్లు మొదటి రోజు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లు కలుపుకుని ఈ మొత్తం రానుందట.
నిజాం ఏరియాలో కేవలం ప్రీమియర్స్ ద్వారా ఐదు నుంచి ఆరు కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. టోటల్‌గా పెయిర్ ప్రీమియర్స్ ద్వారా రూ.13కోట్లు వచ్చాయని టాక్. ఇక ఓవర్సీస్‌లో ఫస్ట్ డే పది కోట్లు దాటిందని సమాచారం.
ఓవరాల్‌గా ఈ మూవీ తొలి రోజు సుమారు ఎనభై కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఏ రేంజ్‌లో వసూళ్లని రాబడుతుందో చూడాలి.
55
కొహినూర్ వజ్రం చుట్టూ తిరిగే `హరి హర వీరమల్లు` మూవీ
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, ఆయన తండ్రి, స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, నెగటివ్ రోల్‌లో బాబీ డియోల్ నటించారు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు గురువారం విడుదలైంది. 17వ శతాబ్దంలో మొఘల్ పాలనా సమయంలో కొహినూర్ వజ్రాన్ని ఔరంగజేబ్ కాజేస్తాడు. ఆయన వద్ద ఉన్న వజ్రాన్ని తేవడం కోసం పవన్ చేసే జర్నీనే ఈ మూవీ.