ఈ ఇద్దరితో పాటు, లక్స్ పాప ఫేమ్ ఫ్లోరా సైని, జబర్దస్త్ కామెడియన్ ఇమ్మాన్యుయేల్, నటుడు భరణి, తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు వంటి పాపులర్ సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.గత ఏడాది సీజన్ 8లో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తులు హౌస్‌లో ఉండటంతో ప్రేక్షకుల్లో ఆ ఆసక్తి తగ్గిపోయింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి నిర్వాహకులు పాపులర్ ఫేసెస్‌తో బిగ్‌బాస్ 9ని మరింత గ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, సెలబ్రిటీల ఎంపికపై జరిగే అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో షో ప్రసారం ప్రారంభం కానున్న అవకాశం ఉంది.