అందరి ముందు అమ్మాయిని ఆ మాట అడిగేసిన లాయర్, గర్భవతిగా అదరగొట్టిన అనుమప.. వకీల్ సాబ్ ని గుర్తు చేసేలా

Published : Sep 03, 2025, 01:09 PM IST

అనుపమ పరమేశ్వరన్ గర్భవతిగా నటించిన జేఎస్‌కె చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రంలో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
అనుపమ పరమేశ్వరన్ తెలుగు చిత్రాలు

అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ రాణిస్తోంది. నటిగా ప్రశంసలు అందుకుంటోంది. తెలుగులో అనుపమ.. అ..ఆ, శతమానం భవతి, కార్తికేయ 2 లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అనుపమ మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన నటి. అక్కడ కూడా ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. 

25
ఓటీటీలో దూసుకుపోతున్న జేఎస్‌కె

ఇటీవల అనుపమ పరమేశ్వరన్ నటించిన జేఎస్‌కె అనే చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఆగస్ట్ 15 నుంచి జీ 5 ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ముఖ్యంగా గర్భవతిగా అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, లాయర్ పాత్రలో సురేష్ గోపి నటన ఈ చిత్రానికి హైలైట్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పొచ్చు. 

35
కథ ఏంటంటే 

కథ విషయానికి వస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి బెంగుళూరులో ఐటీ జాబ్ చేస్తూ ఉంటుంది. కేరళలోని తన సొంత ఊరిలో పండగ జరుపుకోవడానికి వస్తుంది. అక్కడ జానకి తన స్నేహితులతో కలిసి ఒక బేకరీకి వెళుతుంది. అక్కడ ఊహించని విధంగా జానకి లైంగికంగా దాడికి గురవుతుంది. ఆ లైంగిక దాడి కారణంగా జానకి గర్భవతి అవుతుంది.  గర్భవతి అయిన జానకి తనకి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం మొదలు పెడుతుంది. ఆమెకి వ్యతిరేకంగా లాయర్ డేవిడ్ ( సురేష్ గోపి) కోర్టులో వాదిస్తారు. జానకి వ్యతిరేకంగా ఉన్న లాయర్ డేవిడ్ చివరికి ఆమెకి ఎలా సాయం చేశారు ? అసలు జానకి కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం ఎవరు ? నిజంగానే ఆమెపై లైంగిక దాడి జరిగిందా ? అనేది మిగిలిన కథ. 

45
సురేష్ గోపి, అనుపమ మధ్య సన్నివేశాలు 

 ఫస్ట్ హాఫ్ లో లాయర్ డేవిడ్.. జానకికి వ్యతిరేకంగా కోర్టులో వాదించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హీరో లైంగిక దాడికి గురైన మహిళకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు ఏంటి అనే అనుమానం కలుగుతుంది. ఆ సీన్లు ఎంగేజింగ్ గా ఉంటాయి. నువ్వు అశ్లీల చిత్రాలు చూస్తావా ? అని కోర్టులో సురేష్ గోపి.. అనుపమని అందరి ముందు బోల్డ్ గా అడుగుతారు. ఆమె కూడా అవును చూస్తాను అని సమాధానం ఇస్తుంది. ఈ సన్నివేశం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. వకీల్ సాబ్ మూవీలో ప్రకాష్ రాజ్ హీరోయిన్ ని మీరు వర్జినా అని అడగడం తెలిసిందే. అనుపమ గురించి సురేష్ గోపి బయట పెట్టే నిజాలతో అనుపమ పైనే అనుమానం కలుగుతుంది. సెకండ్ హాఫ్ ఇంకెత ఉత్కంఠ భరింతంగా ఉంటుందో అనే ఆసక్తి పెరుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో అనుపమపై లైంగిక దాడి చేసింది ఎవరు అనే విషయాన్ని రెండు మూడు ట్విస్టులతో సింపుల్ గా తేల్చేశారు. 

55
చివర్లో సందేశం 

చివర్లో ఒక మహిళకి ఎప్పుడు  కనాలి అనే స్వేచ్ఛ ఉంటుందని, తాను కోరుకోని విధంగా వచ్చిన ప్రెగ్నన్సీని మహిళలు బలవంతంగా మోయాల్సిన అవసరం లేదు అనే సందేశంతో ఈ చిత్రాన్ని ముగించారు. 

Read more Photos on
click me!

Recommended Stories