Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా దంపతులు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ముంబయి బాంద్రాలో ఉన్న తమ ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్’ మూసివేయనున్నట్లు శిల్పా శెట్టి స్వయంగా ప్రకటించారు.
Shilpa Shetty-Raj Kundra:ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వీరిపై రూ. 60 కోట్లకు పైగా పెట్టుబడులను మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్స్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వివాదాల మధ్య మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆ వార్తేంటీ?
25
శిల్పా శెట్టి సంచలన నిర్ణయం
పెట్టుబడి ఒప్పందం పేరుతో రూ.60 కోట్ల మోసం కేసు బాలీవుడ్ ను షేక్ చేసున్న నేపథ్యంతో నటి శిల్పా శెట్టి సంచలన ప్రకటన చేసింది. ముంబయి బాంద్రాలో ఉన్న తమ ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్’ మూసివేయనున్నట్లు శిల్పా శెట్టి స్వయంగా ప్రకటించారు. సినీ కెరీర్‌తో పాటు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన శిల్పా, ముంబయిలో పలు ప్రాంతాల్లో ‘బాస్టియన్’కి ఆరు బ్రాంచ్‌లు ప్రారంభించారు. కానీ తాజా ఆరోపణలు, కేసుల నడుమ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
35
శిల్పా శెట్టి ఎమోషనల్ పోస్ట్
శిల్పా శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్ లో రెస్టారెంట్ ‘బాస్టియన్’మూసివేత విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “ముంబయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మా రెస్టారెంట్ ‘బాస్టియన్’గురువారం తన చివరి సేవను అందిస్తుంది. ఈ ప్రదేశం అనేక మధుర జ్ఞాపకాలను అందించింది, ముంబయి నైట్ లైఫ్‌కి కొత్త గుర్తింపు నిచ్చింది. చివరిసారి ప్రత్యేక వేడుకను నిర్వహిస్తున్నాం. ఈ వేదికకు వీడ్కోలు పలకాల్సి రావడం బాధగా ఉంది. త్వరలోనే కొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం”అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇది పూర్తిగా ముగింపు కాదని కూడా శిల్పా స్పష్టం చేశారు.
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సినీ కెరీర్‌తో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ఆమె ‘సింపుల్ సోల్‌ఫుల్’ యాప్ ద్వారా యోగా, డైట్ ప్లాన్లు, ఫిట్‌నెస్ టిప్స్‌ను అందిస్తోంది.
అంతేకాకుండా, ‘ఐయోసిస్ వెల్‌నెస్’ సెలూన్ చైన్‌కు కో పార్టనర్ కూడా. అలాగే.. మామాఎర్త్, వికెడ్‌గుడ్ వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టింది. అంతేకాక, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ అనే పుస్తకాన్ని రచించింది.
55
రాజ్ కుంద్రా బిజినెస్ వెంచర్స్
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా విభిన్న రంగాల్లో వ్యాపారాలను విస్తరించారు. ఆయన మొదట పష్మినా షాల్స్ వ్యాపారంతో కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత రియల్ ఎస్టేట్, మైనింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. 2009లో ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ లోవాటా కొనుగోలు చేసి క్రీడా రంగంలో కూడా అడుగుపెట్టారు. అదేవిధంగా.. భారతదేశపు మొట్టమొదటి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటింగ్ లీగ్ కు సహ వ్యవస్థాపకుడు కూడా. అలాగే, వియాన్ ఇండస్ట్రీస్, పోకర్ రాజ్ వంటి టెక్నాలజీ అండ్ గేమింగ్ వ్యాపారాలతో కూడా సంబంధాలున్నాయి. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బెస్ట్ డీల్ టీవీ’ షాపింగ్ ఛానల్ కు సహ-ప్రమోటర్‌గా వ్యవహరించారు.