తెలుగు చిత్ర పరిశ్రమలో జమున తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగు వారికి సత్యభామ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జముననే. అంతగా జమున సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆ పాత్రకి అవసరమైన గడసరి తనం జమున దగ్గర ఉంది. జమున రియల్ లైఫ్ లో కూడా ముక్కుసూటిగా ఉంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.