జబర్థస్త్ వల్ల చాలామంది స్టార్ కమెడియన్స్ గా మారారు. ఎక్కడో మూలన ఉన్న టాలెంట్ కు మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలిచింది జబర్ధస్త్. అలాంటి కమెడియన్స్ లో నరేష్ కూడా ఒకడు. అయితే కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించిన నరేష్ ను మోసం చేసింది ఎవరో తెలుసా?
జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నరేష్. జబర్ధస్త్ లో చాలామంది కమెడియన్లు ఉన్నా.. తనదైన మార్క్ తో నరేష్ దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో, చిన్నపిల్లాడిలా కనిపించే లుక్‌తో ప్రేక్షకులను నవ్వుల వర్షంలో ముంచెత్తుతూ ఉంటాడు. అంతలా నవ్వించే నరేష్ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలను కూడా ఆయన ఫేస్ చేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీ అనుభవాల గురించి స్పష్టంగా వెల్లడించాడు.
25
600 పైగా స్కిట్లు..
నరేష్ ఏజ్ పెద్దదే అయినా.. మనిషి పెరగలేదు. అది లోపంలా కాకుండా.. తన కెరీర్ ప్లాస్ లా మార్చుకున్నాడు నరేష్. జబర్థస్త్ తో పాటు.. ఇతర ప్రోగ్రామ్స్ తో కలిపి దాదాపుగా 600 కు పైగా స్కిట్స్ లో నటించాడు నరేష్. సాధారణ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు నరేష్. జీవితంలో ఎదుగుతున్న టైమ్ లో తనను మరోసం చేసిన వారిగురించి ఇంటర్వ్యూలో వెల్లడించిన నరేష్.. తనకు ఏదైనా ఇబ్బంది వస్తే.. జబర్ధస్త్ లో వెరికి చెప్పుకుంటాడో కూడా ఆయన వెల్లడించాడు.
35
నమ్మిన వాళ్లు మోసం చేశారు.
నరేష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు అనుభవించాను. అలాంటి రోజులు మళ్లీ రాకూడదని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ‘ఢీ జూనియర్స్’ కోసం ఆడిషన్‌కు వచ్చిన నేను.. జబర్దస్త్ వైపు అనుకోకుండా వెళ్లాను. సుధాకర్, చంటి ఇద్దరూ నన్ను జబర్దస్త్ స్టేజ్‌కి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అందరితో కలిసి పనిచేశాను. ఇప్పటి వరకు దాదాపు 600 స్కిట్స్ చేశాను” అని నరేష్ చెప్పాడు.
''నన్ను అందరు కమర్షియల్‌గా అనుకుంటారు కానీ వాస్తవానికి అలాంటిదేమీ లేదు. నాకు ఏదైనా సమస్య వస్తే ముందుగా ఇండస్ట్రీలో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్‌లకే చెబుతాను. కానీ కొంత మంది డబ్బు విషయంలో నన్ను మోసం చేశారు. ఆ నష్టం నుంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టింది. నేను కష్టపడ్డ డబ్బు పోగోట్టుకున్నాను. '' అని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు నరేష్.
55
తలుచుకుంటే భయం వేస్తుంది.
నరేష్ మాట్లాడుతూ.. "నేను ఎవరితోనూ వివాదాలకు వెళ్లను, వాటికి చాలా దూరంగా ఉంటాను. ఈవెంట్స్ సమయంలో కూడా రెమ్యునరేషన్ విషయంలో నా నుంచి డిమాండ్లేవి ఉండవు. నాకు వచ్చిన పనిని ఇష్టంగా చేస్తాను. పగలు, ప్రతీకారాల గురించి ఆలోచిస్తే మనసే పాడవుతుంది. అందుకే హ్యాపీగా ఉండటానికే ప్రయత్నిస్తాను.. అయితే అవకాశాల విషయంలో అప్పుడప్పుడు భయం వేస్తుంది, పరిశ్రమలో ఎప్పుడు స్కోప్ ఉంటుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియక ఆ ఆలోచన కొంత భయపెడుతుంది” అని నరేష్ అన్నారు.