ఆస్కార్‌ బరిలో మహావతార్‌ నరసింహ.. రూ.40కోట్లతో తీసిన ఈ మూవీ ఫైనల్‌ కలెక్షన్లు తెలిస్తే మతిపోవాల్సిందే

Published : Nov 25, 2025, 03:59 PM IST

యానిమేషన్‌ ఫిల్మ్ `మహావతార్‌ నరసింహ` థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీ పడుతుండటం విశేషం. 

PREV
15
బాక్సాఫీసుని షేక్‌ చేసిన `మహావతార్‌ నరసింహ`

యానిమేషన్‌ మూవీ విశేష ఆదరణ పొందడం హాలీవుడ్‌ చిత్రాల విషయంలోనే జరుగుతుంది. ఇండియాలో మాత్రం మొన్నటి వరకు అలాంటి సినిమా రాలేదు. కానీ ఇటీవల వచ్చిన `మహావతార్‌ నరసింహ` సంచలనం సృష్టించింది. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్‌ మైథాలజీ ఫిల్మ్ బాక్సాఫీసు ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. జులై 25న ఇది ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్‌గా రిలీజ్‌ అయ్యింది. కన్నడతోపాటు తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ `హరి హర వీరమల్లు`కి పోటీగా విడుదలైంది. కోటిన్నర కలెక్షన్లతో ప్రారంభమైన ఈ సినిమా నెమ్మదిగా పుంజుకుని ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది.

25
మహావతార్‌ నరసింహ ఫైనల్‌ కలెక్షన్లు

హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసిన ఈ మైథాలజీ సినిమా కేవలం రూ.40కోట్లతో రూపొందింది. కానీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇది ఏకంగా రూ.300కోట్ల కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఫైనల్‌ కలెక్షన్లు రూ.300-325కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఇంతటి తక్కువ బడ్జెట్‌తో ఈ స్థాయి విజయం సాధించడం విశేషం. దీంతో ఇది అనేక చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ సినీ ప్రియులు అత్యంత గొప్పగా భావించే అవార్డుల కోసం పోటీపడుతుంది.

35
ఆస్కార్‌ బరిలో మహావతార్‌ నరసింహ

సినిమాలకు సంబంధించి ఆస్కార్‌ అవార్డులను అత్యంత ప్రస్టీజియస్‌గా భావిస్తారు. ఈ అవార్డుల కోసం ఇప్పుడు `మహావతార్‌ నరసింహ` మూవీ పోటీ పడుతుండటం విశేషం. యానిమేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్ విభాగంలో ఇది పోటీలో ఉంది. ఆస్కార్‌ నామినేషన్‌కి పంపించడానికి అర్హత సాధించింది. యానిమేషన్‌ కేటగిరిలో ఈ సారి 35 సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో `మహావతార్‌ నరసింహ` కూడా ఎంపికైంది.

45
నామినేట్‌ అయితే సరికొత్త రికార్డు

ఈ 35 సినిమాలను ఫిల్టర్‌ చేసి ఆస్కార్‌ నామినేషన్‌కి పంపిస్తారు. ఒకవేళ నామినేట్‌ అయ్యిందంటే ఇక ఆస్కార్‌ కి పోటీ పడుతున్నట్టే లెక్క. అంతేకాదు ఆస్కార్‌ నామినేషన్‌కి ఎంపికైతే యానిమేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సినిమాగా `మహావతార్‌ నరసింహ` రికార్డు సృష్టిస్తుందని చెప్పొచ్చు. 98వ అకాడమీ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రకటిస్తారు. మార్చి 15న ఆస్కార్‌ అవార్డుల వేడుకని నిర్వహిస్తారు. దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ తీసిన `హోంబౌండ్` మూవీ ఇప్పటికే భారత్ తరఫున ఆస్కార్ కు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఇది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతోంది.

55
మహావతార్‌ నరసింహ కథ ఇదే

విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహ స్వామి అవతారాన్ని బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందించారు. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడుకునేందుకు ఆ విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి అసుర రాజు అయిన హిరణ్య కశ్యపుడిని అంతం చేయడమే ఈ సినిమా. ఆద్యంతం విజువల్ వండర్‌గా దీన్ని రూపొందించారు. డ్రామా, ఎమోషన్స్, యాక్షన్‌ మేళవింపుగా పెద్దల నుంచి పిల్లల వరకు అందరు ఎంజాయ్‌ చేసేలా రూపొందించారు. అందుకే ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. యానిమేషన్‌ ఫిల్మ్ విభాగంలో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories