అల్లరి నరేష్‌, ప్రియదర్శి, రాజ్‌ తరుణ్‌లకు చుక్కలు చూపిస్తోన్న `రాజు వెడ్స్ రాంబాయి`.. 4 రోజుల కలెక్షన్లు

Published : Nov 25, 2025, 02:03 PM IST

అల్లరి నరేష్‌, ప్రియదర్శి, రాజ్‌ తరుణ్‌లకు ఓ చిన్న సినిమా చుక్కలు చూపిస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద డీలా పడగా, రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. 

PREV
15
అల్లరి నరేష్‌, ప్రియదర్శిలకు రాజు వెడ్స్ రాంబాయి ఝలక్‌

ఈ శుక్రవారం ఐదారు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లరి నరేష్‌ `12ఏ రైల్వే కాలనీ`, ప్రియదర్శి `ప్రేమంటే`, రాజ్‌ తరుణ్‌ `పాంచ్‌ మినార్‌` నోటెడ్‌గా ఉన్నాయి. అయితే వీటితోపాటు ఓ రియల్‌ లవ్‌ స్టోరీ బేస్డ్ గా రూపొందిన `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ కూడా విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. అల్లరి నరేష్‌, ప్రియదర్శి, రాజ్‌ తరుణ్‌ ల చిత్రాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ హీరోల సినిమాలు కలెక్షన్ల పరంగా కోటి, రెండు కోట్ల దగ్గరే ఆగిపోతే `రాజు వెడ్స్ రాంబాయి` ఏకంగా పది కోట్లకు చేరుకోవడం విశేషం.

25
అల్లరి నరేష్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు

అల్లరి నరేష్‌ జోనర్‌ మార్చి సినిమాలు చేస్తున్నారు. కామెడీ కాకుండా థ్రిల్లర్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `12ఏ రైల్వే కాలనీ` చిత్రంలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో హర్రర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ నాలుగు రోజులు రెండు కోట్ల(రూ.2.83cr) కలెక్షన్లు దాటింది. కేవలం కోటిన్నర షేర్‌ మాత్రమే రాబట్టింది. సోమవారం నుంచి దారుణంగా పడిపోయింది. అల్లరి నరేష్‌ గత చిత్రాలతో పోల్చితే ఈ మూవీ చాలా డ్రాప్‌లో ఉంది. దీంతో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు.

35
ప్రియదర్శి `ప్రేమంటే` డిజాస్టర్‌

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన `ప్రేమంటే` మూవీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది నాలుగు రోజుల్లో కేవలం కోటిన్నర(రూ.1.65) మాత్రమే వసూలు చేసింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీసు వద్ద వద్ద డిజాస్టర్‌గా నిలవబోతుంది. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో నిర్మించారు. దీంతోపాటు విడుదలైన రాజ్‌ తరుణ్‌ `పాంచ్‌ మినార్‌` మూవీ కోటీ కలెక్షన్ల దగ్గరే ఆగిపోయింది.

45
దుమ్ములేపుతున్న రాజు వెడ్స్ రాంబాయి

ఈ సినిమాలకు పెద్ద ఝలక్‌ ఇచ్చింది స్వచ్ఛమైన విలేజ్‌ లవ్‌ స్టోరీ `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ. ఇది బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. నాలుగు రోజుల్లోనే సుమారు రూ.9కోట్లు దాటింది. ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో పది కోట్లు దాటేసింది. కేవలం మూడు కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే దానికి మూడు రెట్లు వసూళ్లని సాధించడం విశేషం. అంతేకాదు రోజు రోజుకిది పుంజుకుంటోంది. ఇది యాభై కోట్ల వరకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు నిర్మాతలు.

55
ఇల్లందులో జరిగిన రియల్‌ లవ్‌ స్టోరీతో

ఇందులో అఖిల్‌ రాజ్‌, తేజస్విని జంటగా నటించారు. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేటర్లో విడుదల చేశారు. తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఇల్లందులోని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విలేజ్‌ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథ. ఆ విలేజ్‌లో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథ ఆద్యంతం కట్టిపడేస్తుందని చెప్పొచ్చు. పరువు కోసం హీరోయిన్‌ తండ్రి చేసిన దారుణం ఈ మూవీలో హైలైట్‌గా నిలుస్తుంది. క్లైమాక్స్ లో గుండెని బరువెక్కిస్తుంది. నటీనటులు కూడా అంతే సహజంగా నటించి సినిమాకి ప్రాణం పోశారు, దర్శకుడు టేకింగ్‌ ఇందులో మరో హైలెట్‌గా చెప్పాలి. యూత్‌తోపాటు 90కి కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories