ఆయన నన్ను చంపేస్తాడు, నా డబ్బులు ఇప్పించండి... జబర్ధస్త్ వినోదిని కంప్లైంట్!

First Published Apr 9, 2021, 11:45 AM IST


జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్ వినోద్ అలియాస్ వినోదిని . ఎక్కువగా చమ్మక్ చంద్రతో కలిసి స్కిట్స్ చేస్తూ ఉండేవాడు వినోద్. జబర్దస్త్ లో ఎక్కువ కాలం పనిచేసిన కమెడియన్స్ లో వినోద్ కూడా ఒకరు. 

అయితే వినోద్ కొంత కాలంగా ఓ సమస్యలో చిక్కుకొని ఇబ్బందిపడుతున్నారు. ఓ ఇంటి కొనుగోలు విషయమై సమస్యలలో ఇరుక్కున్నాడు. కాచిగూడాలో వినోద్ అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. 2019లో ఆ ఇంటి ఓనర్ బాలాజీ వినోద్ కి రూ. 40లక్షలకు బేరం పెట్టడం జరిగింది.
undefined
దీనితో రూ. 10లక్షలు ఇంటి ఓనర్ కి అడ్వాన్స్ గా వినోద్ చెల్లిండం జరిగింది. మిగతా డబ్బులు తీసుకొని ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని వినోద్ కోరగా,  బాలాజీ నిరాకరించడంతో పాటు అనుకున్న మొత్తం కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడట.
undefined
కనీసం తాను చెల్లించిన అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వమని అడగడంతో తనపై బాలాజీతో పాటు కుటుంబ సభ్యులు దాడి చేశారని, 2019 జులైలో వినోద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
undefined
తాజాగా ఇంటి ఓనర్ బాలాజీ నుండి తనకు ప్రాణహాని ఉందని అంబర్ పేట డీసీపీ రమేష్ రెడ్డికి వినోద్ పిర్యాదు చేశాడు. ఇంటి ఓనర్ కి తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని, ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.
undefined
ఈ కేసు విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని వినోద్ డీసీపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కేసు విచారణలో ఉందని చెప్పి, డీసీపీ వినోద్ ను అక్కడ నుండి పంపివేశారని సమాచారం.
undefined
అప్పట్లో ఇంటి ఓనర్ దాడిలో వినోద్  కంటికి బలమైన గాయం తగిలింది. కొన్నాళ్లు అతని కన్ను పనిచేయక పోవడంతో, జబర్దస్త్ షోకి కూడా దూరం అయ్యారు. దాదాపు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా వినోద్ కి న్యాయం జరగకపోవడం విచారకరం.
undefined
click me!