ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలను దిల్ రాజు స్వయంగా నిర్మించారు. అంతే కాదు వీటితో పాటు బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాకు దిల్ రాజు నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇక . ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం, గేమ్ చేంజర్ మూవీ మాత్రం ప్లాప్ గా నిలిచింది. సంగం కూడా వసూళ్ళు చేయలేకపోయింది సినిమా.
Also Read:15 000 కోట్ల ఆస్తిని సైఫ్ అలీ ఖాన్ వదులుకోబోతున్నాడా..?
అదేంటి గేమ్ ఛేంజర్ ప్లాప్ అయ్యింది కదా.. మరి అని అందరికి అనుమానం రావచ్చు. కాని ఇక్కడే మేకర్స్ చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు. ఈ మూడు సినిమాలకు సబంధించిన పోస్టర్స్ లో రిలీజ్ తరువాత వందల కోట్లు కలెక్షన్లు వస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఇదే ఇప్పుడు ఐటీ రైడ్స్ కు దారి తీసినట్టు సమాచారం.
Also Read:సంధ్య థియేటర్ లో సంచలన రికార్డ్ కొట్టిన పుష్ప2
Sankranthiki Vasthunam, venkatesh, dil raju, game changer
మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయ్యి.. సరిగ్గా కలెక్షన్లు రాలేదన్న సంగతి తెలిసిందే. కాని ఈమూవీ టీమ్ మాత్రం ఫస్ట్ డేనే 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు పోస్టర్ వేసేవారు.
దాంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రతీ ఒక్కరి దగ్గర ఇదే డిస్కర్షన్ నడిచింది. మరో వైపు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియా కాకపోయినా.. వారం తిరక్క ముందే 200 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేశారు.
Dil Raju
అందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఇవి ఇలా వైరల్ అవ్వడం వల్లే ఆయనపై నేడు ఇలా ఐటీ దాడులు జరిగాయని సమాచారం. అయితే ఇండస్ట్రీలో దిల్ రాజుకు మంచి పేరు ఉంది. ఆయన ఎప్పుడు టాక్స్ లు ఎగ్గట్టలేదు. ఇటువంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు అని ఆయనకు పేరు. ఆ పేరు వల్లే.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించారు సీఎం.
అంతే కాదు దిల్ రాజు ఐటీ సోదాల్లో క్లీన్ చిట్ తో బయటపడుతారని ఆయన్ని సినిమా జనాల నమ్మకం. ఇక ఇక్కడ మరో విషయం వైరల్ అవుతోంది. ఈఐటీ సోదాల్లో 400 కోట్లలెక్కలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 400 కోట్లు ఏంటి.. ఏ లెక్కలు.. సినిమాలవా.. దిల్ రాజు పర్సనల్ లెక్కలా.. అసలు ఇందులో నిజం ఎంతా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.