పదేళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో బాలయ్య రొమాన్స్? అప్పుడు ఫ్లాప్‌, మరి ఇప్పుడైనా హిట్‌ ఇస్తుందా?

బాలకృష్ణ పదేళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు ఫ్లాప్‌ ఇచ్చిన ఆ అమ్మడు ఇప్పుడు అయినా సక్సెస్‌ ఇస్తుందా?  
 

that star heroine romance with Balakrishna after 10 years will she give hit atleast now ? arj

నందమూరి నటసింహం బాలకృష్ణ బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు విజయాలు అందుకున్నారు. ఇప్పుడు `డాకు మహారాజ్‌`తో ఆడియెన్స్‌ ని అలరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లని రాబట్టింది. ఇంకా థియేటర్లలో ఆడుతుంది. 

that star heroine romance with Balakrishna after 10 years will she give hit atleast now ? arj

ఇక నెక్ట్స్ సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు బాలయ్య. ప్రస్తుతం ఆయన `అఖండ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మహా కుంభమేళాలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఏపీలో సముద్రలో షూటింగ్‌ చేస్తున్నారు. త్వరలోనే బాలయ్య ఈ మూవీ చిత్రీకరణలో ప్రారంభం కాబోతున్నారట. ఇందులోనూ ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 
 


ఆ తర్వాత తనకు `వీరసింహారెడ్డి` వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాని అందించిన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతుంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్‌ 10న ప్రారంభమవుతుందని తెలుస్తుంది. బాలకృష్ణని పవర్‌ఫుల్‌గా చూపించడంలో బోయపాటి తర్వాతనే ఎవరైనా అని అంటుంటారు, కానీ `వీరసింహారెడ్డి` మూవీ చూస్తే ఆయన్ని మించిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు మరో బ్లాక్‌ బస్టర్‌ కోసం బాలయ్య, గోపీచంద్‌ మలినేని కలవబోతున్నారు. 

ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ వినిపిస్తుంది. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్లకి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటించబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఇందులో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందని, ప్రభాస్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం డార్లింగ్‌తో `ది రాజా సాబ్‌`లో నటిస్తుంది. 
 

ఇదిలా ఉంటే పదేళ్ల తర్వాత బాలయ్యకి జోడీ కడుతుంది త్రిష. ఆమె చివరగా 2015లో వచ్చిన `లయన్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ మూవీ పరాజయం చెందింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించింది లేదు. ఈ క్రమంలో ఇప్పుడు పదేళ్ల తర్వాత బాలయ్యతో జోడీ కట్టేందుకు రెడీ అయ్యిందని తెలుస్తుంది. అప్పుడు ఫ్లాప్‌ ఇచ్చిన త్రిష ఇప్పుడు అయినా సక్సెస్‌ ఇస్తుందా అనేది చూడాలి. 

Latest Videos

click me!