అనిల్‌ రావిపూడికి విజయ్‌ షాక్‌, `భగవంత్‌ కేసరి` రీమేక్‌ వెనుక జరిగింది ఇదేనా?

Published : Jan 27, 2025, 09:31 PM IST

అనిల్‌ రావిపూడి రూపొందించిన `భగవంత్‌ కేసరి` సినిమాని విజయ్‌ రీమేక్‌ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ `జన నాయకన్‌`లో ఆయనకు ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వలేదు ఇదే షాకిస్తుంది.   

PREV
15
అనిల్‌ రావిపూడికి విజయ్‌ షాక్‌, `భగవంత్‌ కేసరి` రీమేక్‌ వెనుక జరిగింది ఇదేనా?

దళపతి విజయ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `జన నాయకన్‌`. అనిల్‌ రావిపూడి రూపొందించిన `భగవంత్‌ కేసరి` చిత్రానికి రీమేక్ అని టాక్. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

`ప్రేమలు` ఫేమ్‌ మమితా బైజు మరో కీలక పాత్ర పోషిస్తుంది. బాబీ డియోల్‌ నెగటివ్ రోల్‌ చేస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. 
 

25

ఈ మూవీని పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు హెచ్‌ వినోద్‌. ఇది విజయ్‌ నటిస్తున్న 69వ మూవీ కావడం ఓ విశేషం అయితే, విజయ్‌ నటిస్తున్న చివరి మూవీ ఇదే కావడం మరో విశేషం. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశం అయ్యింది. నిన్న ఫస్ట్‌ లుక్‌ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో తెలుగు దర్శకుడు అనిల్‌ రావిపూడి పేరు లేదు. 

read more;శివుడి వద్దకు కార్తికేయుడి ప్రయాణం.. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా స్టోరీ ఇదే?

35

ఈ మూవీ అనిల్‌ రావిపూడి రూపొందించిన `భగవంత్‌ కేసరి` చిత్రానికి రీమేక్‌ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ పోస్టర్‌లో ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వలేదు. దీంతో ఇది రీమేక్‌ కాదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రైట్స్ తీసుకున్నా కథ విషయంలో అనిల్‌ రావిపూడి పేరు వేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో అది లేదు. కేవలం మూవీ దర్శకుడు హెచ్‌ వినోద్‌ పేరు, టెక్నీషియన్ల పేర్లు వేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 
 

45

విజయ్‌ ఓరకంగా అనిల్‌ రావిపూడికి షాక్‌ ఇచ్చాడని అర్థమవుతుంది. అయితే `భగవంత్‌ కేసరి` రీమేక్‌ని అనిల్‌ రావిపూడినే చేయాలని విజయ్‌ కోరినట్టు, రీమేక్‌ చేయనని అనిల్‌ రిజెక్ట్ చేసినట్టు ఇటీవల `సంక్రాంతికి వస్తున్నాం` ఈవెంట్‌లో వీటీవీ గణేష్‌ తెలిపారు.

కానీ ఇప్పుడు కనీసం ఇది రీమేక్‌ అనే విషయమే ఎక్కడా మెన్షన్‌ చేయలేదు టీమ్‌. పోస్టర్స్ లోనూ ఆ ప్రస్తావన లేదు. దీంతో ఇది `భగవంత్‌ కేసరి` రీమేక్‌ కాదా? అనే వాదన తెరపైకి వచ్చింది. 
 

55

`భగవంత్‌ కేసరి` రీమేక్‌ విషయంలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి రీమేక్‌ చేయడానికి అనిల్‌ రావిపూడి సుముఖంగానే ఉన్నాడట. తానే డైరెక్ట్ చేస్తాడని చెప్పారట. కానీ విజయ్‌, ఆయన టీమ్‌ ఒప్పుకోలేదని సమాచారం. అక్కడే క్లాష్‌ వచ్చిందని తెలుస్తుంది.

దీంతో రైట్స్ వరకే అమ్మారని, ఫైనల్‌గా ఆ రైట్స్ విషయంలోనూ కొంత క్లాష్‌ నెలకొందని తెలుస్తుంది. ఈ కారణంగానే అనిల్‌ రావిపూడికి రైట్స్ ఇవ్వలేదా? లేక పూర్తిగా ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టి వేరే కథతో `జన నాయకన్‌` సినిమాని చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. 

Read more:`పుష్ప 2` ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. నిడివి ఎంతో తెలుసా? ఓటీటీ వెర్షన్‌లో మరో సర్‌ప్రైజ్‌!

also read: బ్రహ్మానందంలో కామెడీని గుర్తించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన్ని కలవకపోతే లెజెండ్‌ని మిస్‌ అయ్యేవాళ్లం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories