`పుష్ప 2` ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. నిడివి ఎంతో తెలుసా? ఓటీటీ వెర్షన్‌లో మరో సర్‌ప్రైజ్‌!

Published : Jan 27, 2025, 08:04 PM IST

`పుష్ప 2` సినిమా థియేటర్లలో దుమ్మురేపింది. ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీలో మరింతగా సర్‌ప్రైజ్‌ చేయడానికి రాబోతుంది. ఓటీటీ డేట్‌ ఫిక్స్ అయ్యింది.   

PREV
15
`పుష్ప 2` ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. నిడివి ఎంతో తెలుసా? ఓటీటీ వెర్షన్‌లో మరో సర్‌ప్రైజ్‌!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సుకుమార్‌ రూపొందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. నార్త్ లో కలెక్షన్ల దుమ్మురేపింది. ఇండియన్‌ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు రూ. 1900కోట్లు రాబట్టింది. 
 

25
Allu Arjun, #Pushpa2, sukumar

రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌లో అనసూయ, సునీల్‌, జగపతిబాబు, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదలైన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ లో `పుష్ప 2` స్ట్రీమింగ్‌ కాబోతుంది. జనవరి 30న ఇది ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. 

35

ఇదిలా ఉంటే `పుష్ప 2`సినిమా నిడివి ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ సినిమా థియేటర్లో మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో విడుదలైంది. విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత దీనికి మరో ఇరవై నిమిషాలు యాడ్‌ చేసింది టీమ్‌. మూడు గంటల 40 నిమిషాల నిడివితో జనవరి 17న `పుష్ప 2` రీ లోడెడ్‌ పేరుతో మరోసారి రిలీజ్‌ చేశారు. దీంతో ఫస్ట్ వెర్షన్‌లో ఉన్న అనేక ప్రశ్నలకు ఈ రీ లోడెడ్‌ వెర్షన్‌ సమాధానం చెప్పింది. 
 

45

ఇదిలా ఉంటే ఓటీటీ వెర్షన్‌లో మరికొంత కంటెంట్‌ని యాడ్‌ చేస్తున్నారట. సుమారు నాలుగు నిమిషాల నిడివి కంటెంట్‌ని యాడ్‌ చేస్తున్నారట. ఇలా మొత్తంగా ఓటీటీ వెర్షన్‌లో మూడు గంటల 44 నిమిషాల నిడివితో `పుష్ప 2` రాబోతుందని చెప్పొచ్చు. ఇది ఫ్యాన్స్ కి, కామన్‌ ఆడియెన్స్ కి ఫుల్‌ మీల్స్ అని చెప్పొచ్చు. 
 

55

`పుష్ప2` సినిమాని నార్త్ఆడియెన్స్ బాగా ఆదరించారు. కానీ సౌత్‌లోఇది పెద్దగా ఆడలేదు. తెలంగాణలో తప్ప ఏపీ, తమిళనాడు, కేరళా, కర్నాటకలో ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో అయినా మన ఆడియెన్స్ చూస్తారా? అనేద ఆసక్తికరంగా మారింది. ఓటీటీ దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

read more: శివుడి వద్దకు కార్తికేయుడి ప్రయాణం.. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా స్టోరీ ఇదే?

also read: బ్రహ్మానందంలో కామెడీని గుర్తించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన్ని కలవకపోతే లెజెండ్‌ని మిస్‌ అయ్యేవాళ్లం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories