బ్రహ్మానందంలో కామెడీని గుర్తించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన్ని కలవకపోతే లెజెండ్‌ని మిస్‌ అయ్యేవాళ్లం

Published : Jan 27, 2025, 07:22 PM IST

హాస్య బ్రహ్మా బ్రహ్మానందం సినిమాల్లోకి వచ్చిన నాలుగు దశాబ్దాలు అవుతుంది. ఇన్నాళ్లపాటు మనల్ని తన అద్భుతమైన కామెడీతో నవ్వించారు బ్రహ్మీ. మరి ఆయన పరిచయం ఎలా జరిగిందో తెలుసా?  

PREV
16
బ్రహ్మానందంలో కామెడీని గుర్తించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన్ని కలవకపోతే లెజెండ్‌ని మిస్‌ అయ్యేవాళ్లం

హాస్య బ్రహ్మా బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతుంది. ఈ క్రమంలో ఆయన 1100లకుపైగా సినిమాల్లో నటించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. తనదైన హాస్యంతో తెలుగు ఆడియెన్స్ ని నవ్వించారు.

కామెడీకి రారాజులా వెలిగారు. మొదటి తరం, రెండో తరం, మూడో తరం ఇలా ఎంత మంది కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందం ని మించిన కమెడియన్‌ లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

26

అయితే ఇటీవల బ్రహ్మానందం సినిమాలు తగ్గించారు. కొత్త కమెడియన్లు వస్తున్న నేపథ్యంలో కామెడీలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సరికొత్త కామెడీతో నేటితరం కమెడియన్లు నవ్విస్తున్నారు. వారితో బ్రహ్మీ పోటీ పడలేకపోతున్నారని చెప్పొచ్చు.

అదే సమయంలో బ్రహ్మీ కామెడీ కూడా రొటీన్‌ అనే ఫీలింగ్‌ వచ్చింది. దీంతో తానే సినిమాలు తగ్గించుకున్నట్టు చెప్పారు బ్రహ్మానందం. ఇటీవల తన కొడుకుతో కలిసి `బ్రహ్మానందం` సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రెస్‌ మీట్‌లో బ్రహ్మానందం ఈ విషయాలను వెల్లడించారు.  
 

36

ఇదిలా ఉంటే బ్రహ్మానందం అలీతో సరదాగా టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను ఎలా ఇండస్ట్రీలోకి వచ్చానో వెల్లడించారు. తనని ఎవరు పరిచయం చేశారో తెలిపారు బ్రహ్మానందం. ఆయన సినిమాల్లోకి రాకముందు తెలుగు మాస్టార్‌.

కాలేజీ లెక్చరర్‌గా పనిచేసేవారు. బాగా కామెడీ చేస్తున్నారని చెప్పి సినిమాల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఒకరు ఓ పెద్ద సూపర్‌ స్టార్‌కి పరిచయం చేశారు. ఆయన బ్రహ్మీలోని కామెడీని గుర్తించాడు. సినిమాలకు పరిచయం చేశారు. మరి ఆయన ఎవరు? అనేది చూస్తే. 
 

46

ఆయన ఎవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు నటించిన కామెడీ మూవీ `చంటబ్బాయి`. ఇందులో కమెడియన్ల కోసం ఆడిషన్‌ జరుగుతుంది. ఓ ప్రముఖుడు బ్రహ్మానందంని చిరంజీవికి పరిచయం చేశారు. ఇలా లెక్చరర్‌ అని చెబుతున్నాడు, ఎంత వరకు నిజమో తెలియదు, బాగా కామెడీ చేస్తాడట. ఒకసారి చూడండి అని చిరంజీవికి చెప్పాడట ఆ ప్రముఖ వ్యక్తి. దీంతో చిరు సరదాగా టెస్ట్ చేశారు.

బ్రహ్మానందం రెచ్చిపోయాడు. ఇక్కడ కాదు, డాల్ఫిన్‌ హోటల్‌లో ఉంటాను, అక్కడి రా అని చెప్పాడట చిరు. దీంతో డాల్ఫిన్‌ హోటల్‌కి వెళ్లాడు బ్రహ్మీ. అక్కడ తన విశ్వరూపం చూపించాడు. తన వద్ద కామెడీ ఆయుధాలను ఒక్కొక్కటి ప్రదర్శించారు. దీంతో చిరంజీవి ఫిదా అయిపోయారు. 

56

నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, సినిమాల్లోకి వచ్చేయ్‌, నేను చూసుకుంటా అన్నాడట. అంతే చిరంజీవిపై నమ్మకంతో ముందడుగు వేశాడు బ్రహ్మానందం. `చంటటబ్బాయి` దర్శకుడు జంధ్యాలకు పరిచయం చేశారు. రామానాయుడు అవకాశం ఇచ్చారు.

అలా `చంటబ్బాయి` మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బ్రహ్మానందం.  తనకు లైఫ్‌ ఇచ్చిన చిరు, జంధ్యాల, రామానాయుడులకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు బ్రహ్మానందం. 

66

ఈ సందర్భంగా చిరంజీవితో తన ఫస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకున్నారు బ్రహ్మీ. అప్పట్లో చిరంజీవిలో పెద్ద సూపర్‌ స్టార్‌. టాప్‌ హీరోగా రాణిస్తున్నారు. క్రేజ్‌లో ఆయన్ని మించిన వారు లేరు. అప్పట్లో ఆయన్ని కలవడమంటే మామూలు విషయం కాదు, అదొక డ్రీమ్‌. కానీ బ్రహ్మానందంకి డైరెక్ట్ గా దక్కింది.

దీంతో ఆయన్ని చూడటమే గొప్ప అనుకుంటే చిరంజీవిని కలవడం జరిగింది, ఆయనకు క్లోజ్‌ కావడం జరిగింది, ఆయన తనని హగ్‌ చేసుకోవడం జరిగిందని, ఇంటికి కూడా తీసుకెళ్లాడని, అంతేకాదు తనతోనే మొదటిసారి తనకి ఫ్లైట్‌ ఎక్కించాడని తెలిపారు బ్రహ్మానందం.

మద్రాస్‌కి తీసుకెళ్లాడని వెల్లడించారు. ఇలా చిరంజీవితో తనకు బెస్ట్ మెమొరీస్‌ ఉన్నాయని, తనకు సినీ జీవితాన్ని ఇచ్చాడని తెలిపారు బ్రహ్మానందం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. 

read  more: తండ్రి శివుడి వద్దకు కార్తికేయుడి ప్రయాణం.. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా స్టోరీ ఇదే?

also read: `అమరన్‌` సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న శివకార్తికేయన్‌.. దీపావళికి SK23
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories