2024 లో బిగ్ డిజాస్టర్స్‌గా మిగిలిన టాప్-5 భారీ బ‌డ్జెట్ సినిమాలు

Published : Dec 17, 2024, 10:51 AM IST

Year Ender 2024 - Big budget flop movies: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రికార్డుల  మోత మోగిస్తే.. 2024 లో విడుద‌లైన ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ డిజాస్ట‌ర్స్ గా మిగిలాయి. భారీ బ‌డ్జెట్, బిగ్ స్టార్స్ ఉండి 2024 లో బిగ్ ఫ్లాప్ టాప్-5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
16
2024 లో బిగ్ డిజాస్టర్స్‌గా మిగిలిన టాప్-5 భారీ బ‌డ్జెట్ సినిమాలు
Year Ender 2024, Top 5 big budget films flopped at the box office

Year Ender 2024: 2024 సంవత్సరం భార‌త సిని ప‌రిశ్ర‌మ‌కు మిశ్ర‌మ ఫ‌లితాలు ఇచ్చింది. 'భూల్ భూలయ్యా 3', 'పుష్ప 3' వంటి చిత్రాలు థియేటర్‌లలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాలు అద్భుతమైన కలెక్షన్‌లను సాధించి కొత్త రికార్డుల మోత మోగించాయి. ఇదే స‌మ‌యంలో కొన్ని సినిమాలు భారీ బడ్జెట్‌లు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేక బిగ్ ఫ్లాప్ గా మిగిలాయి. ఈ లిస్టులో టాప్ స్టార్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. 2024 లో బిగ్ ఫ్లాప్ గా మిగిలిన టాప్-5 భారీ బ‌డ్జెట్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

26
Actror Suriya starrer Kanguva ott release review

1. భారీ అంచ‌నాల సూర్య‌ 'కంగువ' 

సౌత్ సూపర్‌స్టార్ సూర్య నటించిన 'కంగువ' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం భార‌త సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసారు. కానీ ఆ అంచ‌నాల‌ను సూర్య సినిమా అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా ఏదైనా ఉందా అంటే అది సూర్య సినిమా కంగువ. కంగువ‌లో సూర్య‌తో పాటు దిశ ప‌టానీ, బాబీ డియోల్, అరాష్ షా, యోగి బాబు, న‌ట‌రాజ‌న్ సుబ్ర‌మ‌ణ్యం వంటి మంచి గుర్తింపు ఉన్న న‌టులు న‌టించారు. కానీ, సినిమాను ఫ్లాన్ నుంచి త‌ప్పించ‌లేక‌పోయారు. 

36
kollywood movies

2. భారతీయుడు 2

డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాలు అంటే మ‌స్తు క్రేజ్ ఉంటుంది. ఆయ‌న తీసే చిత్రాల్లో ఉండే వైవిధ్య‌మే దీనికి కార‌ణం. దీంతో శంక‌ర్, స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ సినిమా భారీ అంచ‌నాలు పెంచింది. అయితే,  2024 లో కమల్ హాసన్ సినిమా 'ఇండియన్ 2' కూడా థియేటర్లలోకి వచ్చింది కానీ,  బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడ్డారు. నిర్మాతలు 250 కోట్లు వెచ్చించి సినిమాను తీసుకువ‌చ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 151 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

46

3. మైదాన్

అజయ్ దేవగన్‌కి ఈ సంవత్సరం చాలా మిశ్రమంగా ఉంది. ఒకవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 'Singham Again' సినిమా రూ.275 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆయన రెండో సినిమా 'మైదాన్' పరాజయం పాలైంది. 2024 సంవత్సరంలో అజయ్ నటించిన మొదటి చిత్రం మైదాన్, ఇది దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో వ‌చ్చిన సినిమా. అయితే బాక్సాఫీస్ వద్ద రూ. 71 కోట్లు మాత్రమే రాబట్టి బిగ్ డిజాస్ట‌ర్ మూవీగా నిలిచింది.

56
Vashu Bhagnani

4. బడే మియాన్ చోటే మియాన్

బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో కూడుకున్నప్పటికీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. బడే మియాన్ ఛోటే మియాన్ చిత్రం ఈద్ సందర్భంగా విడుదలైంది. 350 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 110 కోట్లను మాత్రమే రాబట్టింది.

66
Bhushan Kumar, Alia Bhatt, fake collections, Jigra

5. జిగ్రా 

రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ఎవరికీ పెద్దగా నచ్చలేదు. అలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందినప్పటికీ కేవలం 55 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో 2024 లో బిగ్ బ‌డ్జెట్ టాప్-5 డిజాస్ట‌ర్ చిత్రాల్లోకి జిగ్రా కూడా చేరింది. 

Read more Photos on
click me!

Recommended Stories