టాలీవుడ్ హీరోలు కొందరు భక్తి మార్గంలో పయనిస్తున్నారు. కలిసివస్తుందా..? లేక అనుకున్న కోరికలు నెరవేరాయా తెలియదు కాని స్టార్ హీరోలు కూడా దేవుని మాలలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా మెగా పవన్ స్టార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు.
ఆయన గత కొన్నేళ్ళుగా ప్రతీ ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలియదు కాని మెగా ఫ్యామిలీలో ఇది ఆచారంగా మారింది. రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు.