ఇండియాలోనే టాప్ 10 హీరోయిన్ల జాబితాలోకి యంగ్ సెన్సేషన్ మమితా బైజు మొదటిసారి ఈ లిస్ట్ లోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో త్రిష డౌన్ కావాల్సి వచ్చింది. మరి టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారంటే?
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్లకి సంబంధించిన లిస్ట్ ని విడుదల చేస్తుంటుంది. హీరోయిన్లు చేసే సినిమాలు, యాడ్స్, వారికి సంబంధించిన డిస్కషన్, ఇమేజ్, మార్కెట్, ఫాలోయింగ్ వంటి అనేక అంశాలను బేస్ చేసుకొని ఈ లిస్ట్ ని తయారు చేస్తుంటారు. ఇందులో రెగ్యూలర్‌గా ఉన్నవాల్లే లిస్ట్ లో ఉంటారు. కాకపోతే చిన్న పాటి మార్పులు ఉంటాయి. స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే అక్టోబర్‌లో నెలలో మాత్రం పెద్దగా మార్పులు లేవు. యంగ్ సెన్సేషన్ మమితా బైజు మొదటిసారి ఈ లిస్ట్ లోకి వచ్చింది. త్రిష, కృతి సనన్ డౌన్ అయ్యారు. మరి సమంత, కాజల్, రష్మిక, నయనతార, సాయిపల్లవి ఏ స్థానాల్లో ఉన్నారనేది చూస్తే.
25
సమంతనే నెంబర్ వన్
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఆమెకి ఈ స్థానంలో తిరుగులేదని చెప్పొచ్చు. ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తూ ఆకట్టుకుంటుంది. సమంత చివరగా `మా ఇంటి బంగారం` చిత్రంలో నటించింది. ఆ సమయంలోనే తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఇప్పుడు ఆమె పండండి మగ బిడ్డకి జన్మనిచ్చింది. దేవ్ నిడిమోరు అనే పేరుని కూడా పెట్టింది. అయితే సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటోంది సమంత. అందుకే ఆమె స్థానంలో మార్పు లేదు.
35
నాల్గో స్థానంలో రష్మిక.. రెండు, మూడు ఎవరంటే ?
రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్, `ఆర్‌ఆర్‌ఆర్` నటి అలియా భట్ ఉంది. ఆమె స్థానంలోనూ మార్పు లేదు. మూడో స్థానంలో `కల్కి 2898ఏడి` బ్యూటీ దీపికా పదుకొనె నిలిచింది. ఆమె స్థానంలోనూ మార్పు లేదు. గత నెలలో కూడా వీళ్లు ఇదే స్థానాలో ఉన్నారు. ఇక నాల్గో స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఆమె కూడా సెప్టెంబర్‌లో 4వ స్థానంలోనే నిలిచింది. ఇప్పుడు అదే స్థానాన్ని పదిలపర్చుకుంది.
ఐదో స్థానంలో సాయిపల్లవి ఉంది. ఆమె ఇటీవల `రామాయణం`లో నటించిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ నుంచే ఆమె స్థానం పెరిగింది. గత నెలలోనూ ఐదో స్థానంలో ఉండగా, అక్టోబర్‌లోనూ అదే స్థానంలో ఉండటం విశేషం. ఇక కాజల్ ఆరో స్థానంలో ఉంది. ఆమె స్థానంలోనూ మార్పు లేదు. అంతకు ముందు ఐదో స్థానంలో ఉండగా, సెప్టెంబర్ నుంచి ఆరుకి పరిమితమయ్యింది. ఏడో స్థానంలో నయనతార ఉంది. సెప్టెంబర్‌లో కూడా నయన్ అదే స్థానంలో ఉంది. ఇలా టాప్ 7 వరకు ఎలాంటి మార్పులు లేవు.
55
లిస్ట్ లోకి వచ్చిన మమితా బైజు.. త్రిష, కృతి సనన్‌కి షాక్
కానీ 8వ స్థానం నుంచి మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ లిస్ట్ లోనే లేని మమితా బైజు మొదటిసారి ఈ లిస్ట్ లోకి రావడం విశేషం. ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. త్రిష, కృతిసనన్ వంటి హీరోయిన్లకి షాకిచ్చింది. తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ భామ కృతి సనన్ ఉంది. పదో స్థానంలో త్రిష ఉంది. సెప్టెంబర్‌లో త్రిష 9వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక్క స్థానం పడిపోయింది. శ్రీలీల, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ వంటి వారు ఈ లిస్ట్ లోనే స్థానాలు కోల్పోవడం గమనార్హం.