Nagarjuna: కులకడం అన్నప్పుడు సమర్ధించా, ఇప్పుడు తలదించుకుంటున్నా.. టెంపర్ వంశీపై నాగార్జున ఫైర్

Published : Nov 21, 2026, 10:54 PM IST

బిగ్ బాస్ తెలుగు 10లో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ముకేశ్, వర్షిణిలకు నాగార్జున క్లాస్ పీకారు. వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
14
Bigg Boss Telugu 10

వీకెండ్ కావడంతో ఇంటి సభ్యుల ఆటతీరుని రివ్యూ చేయడానికి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం జరిగిన తప్పులని ఎత్తి చూపుతూ నాగార్జున తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా డిక్టేటర్స్ గేమ్ లో శివకుమార్, వర్షిణి సంచాలకులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య బేధాభిప్రాయాల కారణంగా గేమ్ మొత్తం రద్దయింది. ఆ రోజు కాంప్రమైజ్ అయి ఉంటే గేమ్ ఉండేది.. మీరే గెలిచేవాళ్ళు కదా అని నాగార్జున అన్నారు.

24
వర్షిణి, ముకేశ్ కి క్లాస్

వంశీ, ఆర్కే ఇద్దరూ ఫౌల్ గేమ్ ఆడారు. అలాంటప్పుడు వంశీని ఎందుకు టార్గెట్ చేశావు ? గేమ్ అయ్యాక మీ టీంకే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఎందుకు కాంప్రమైజ్ కాలేదు. బెస్ట్ సంచాలక్ అనిపించుకోవడం కోసం గేమ్ మొత్తం రద్దు చేశావు అని నాగార్జున ప్రశ్నించారు. ఈ విషయంలో రామ్ ప్రసాద్ గట్టిగా వాదనలు వినిపించారు. డిక్టేటర్ గా ముకేశ్ కి ఎన్ని మార్కులు ఇస్తారు అని వాళ్ళ టీంని నాగార్జున అడిగారు. వర్షిణి మాత్రం 90 మార్కులు ఇచ్చింది. మిగిలిన వాళ్ళు 30, 50 అలా ఇచ్చారు. ఓవరాల్ యావరేజ్ అతడికి 50 మార్కులు పడ్డాయి. ముకేశ్ తనని వీకెస్ట్ గా పెట్టడం నచ్చలేదు అంటూ రామ్ ప్రసాద్ అతడికి 30 మార్కులు మాత్రమే ఇచ్చారు.

34
వంశీ మాటలకు తల దించుకుంటున్నా

త్రిగుణ్ కి వాళ్ళ టీం యావరేజ్ గా 90 మార్కులు ఇచ్చారు. దీనితో నాగార్జున త్రిగుణ్ ని అభినందించారు. ఆ తర్వాత వంశీ గురించి మాట్లాడుతూ నాగార్జున ఫైర్ అయ్యారు. వర్షిణి, ముకేశ్ గురించి వంశీ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎక్కేయడం, తొక్కేయడం అని అసభ్యంగా మాట్లాడారు. ఆ వీడియో నాగార్జున చూపించారు. గతంలో వంశీ కులకడం అనే పదం వాడినప్పుడు నేను సమర్ధించా. ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తిగా తలదించుకుంటున్నా అని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో వంశీ నాగార్జునకు, వర్షిణికి క్షమాపణ చెప్పాడు.

44
వర్షిణిపై ముకేశ్ విజయం

ఆ తర్వాత వర్షిణి, ముకేశ్ మధ్య గేమ్ జరిగింది. ఈ గేమ్ లో విజయం సాధించిన వారు నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ షిప్ కి అర్హత సాధిస్తారు అని నాగార్జున తెలిపారు. వర్షిణిని అడ్డుకుని మరీ ముకేశ్ విజయం సాధించాడు. ఇతర సభ్యలకు గేమ్ ఆదివారం రోజు కంటిన్యూ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories