పెళ్ళైన 6 నెలలకే విడాకులు.. మొగుడు పెద్ద టార్చర్ అంటున్న నాగార్జున హీరోయిన్ ఎవరు..?

Published : Jul 09, 2024, 06:52 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్ళిళ్ళు, విడాకులు, ఇలా రకరకాల జీవితాలు ఇండస్ట్రీలోనే కనిపిస్తుంటాయి. కొన్ని కేసులు మాత్రం కాస్త విచిత్రంగా ఉంటాయి. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉంది. తన భర్త పెద్ద టార్చర్ అంటూ.. పెళ్లైన 6 నెలలకే విడాకులు ఇచ్చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? 

PREV
18
పెళ్ళైన 6 నెలలకే విడాకులు.. మొగుడు పెద్ద టార్చర్ అంటున్న  నాగార్జున  హీరోయిన్ ఎవరు..?

సినిమా పరిశ్రమలో ఎంతో మంది టాలెంట్ ఉన్న స్టార్స్ ఉన్నారు. వారు స్టార్లు గా ఎదగడంతో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న వారితోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కొంత మంది హ్యాపీగా తమ సంసారాలను చక్కదిద్దుకుని ఉండగా.. మరికొంత మంది మాత్రం మనస్పర్ధలతో.. విడాకులంటూ.. రోడ్డుమీదకు వచ్చేశారు. సమంత, నాగచైతన్య, ధనుష్, ఐశ్వర్య, ఇలా కొంత మంది స్టార్లు విడాకుల వరకూ వెళ్ళి.. విడివిడిగా బ్రతుకుతున్నారు. 

బాలయ్య తన ఫ్యాన్స్ ను ఎందుకు కొడతారో తెలుసా..? డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇచ్చిన క్లారిటీ ఇదే..?

28

ఇప్పుడు మనం చెప్పుకున్న స్టార్లు కొంత లో కొంత మూడేళ్లు.. పదేళ్లకు పైగా కాపురం చేసి.. అర్ధ చేసుకున్న తరువాత .. వాల్లకు సెట్ అవ్వదు అని అర్ధం చేసుకుని విడిపోయారు. కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం.. పెళ్ళైన ఆరు నెలలకే తన భర్త వల్ల టార్చర్ అనుభవించాను అని విడాకులు ఇచ్చేసింది. అతనో టార్చర్ గాడు అంటూ.. వదిలేసింది. సోలో లైఫ్ ను సింగిల్ గా హ్యాపీగా గడిపేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. మనీషా కోయిరాల. 
 

రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..

38

సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది మనీషా కోయిరాలా. అటు హిందీ సినిమాలతో పాటు.. ఇటు సౌత్ లో తమిల తెలుగు సినిమాలతో సందడి చేసింది. పుట్టింది నేపాల్ లో అయినా.. ఇండియన్ సినిమాలలో రారాణిగా వెలిగింది సీనియర్ బ్యూటీ. సూపర్ హిట్ సినిమాలతో దూసుకెల్ళింది. స్టార్ హీరోల సరసన ఆడి పాడింది మనీషా. 

నిమిషానికి 10 కోట్లు.. పది నిమిషాల సీన్ కు 100 కోట్లు తీసుకున్న ఇండియన్ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు
 

48

దాదాపు 30 ఏళ్ల క్రితం నాగార్జున్ సినిమాలో ఓ పాట అందరిని మైకంలో ముంచెత్తింది. ఆ పాట ఇప్పటికీ .. ఈ జనరేషన్ వారికి కూడా మనసు కరిగించేస్తుంది. ఆ సాంగ్ క్రిమినల్‌ సినిమాలోది. ఈ పాటలో నాగార్జునతో నటించింది మనీషాకోయిరాల. ఈ సినిమాతోనే ఆమె  దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చింది మనీషా కొయిరాలా. తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. 

58

ఇక మనీషాకు తిరుగులేని ఇమేజ్ ను తీసుకువచ్చిన సినిమా బాంబే.  మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా సౌత్ మొత్తం మనీషా పేరు మారుమోగేలా చేసింది. గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆతరువాత ఆమె కాస్త వివాదాస్పద నటిగా కూడా పేరు తెచ్చుంది. వయస్సు పెరిగే కొద్ది సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ. చాలామంది నటులతో ఎఫైర్ నడిపిందని టాక్. దాదాపు 12 మందితో మనీషా లవ్ ఎఫైర్ నడిపిందని టాక్. 

68

ఇక అన్నీ మానేసి  2010లో పారిశ్రామిక వేత్త సామ్రాట్ దహల్ ను పెళ్ళాడిన  మనీషా కొయిరాల.. పట్టుమని పది నెలలు కూడా కాపురం చేయలేదు. పెళ్లి చేసుకున్న ఆర్నెళ్లకే అతనితో ఉండలేక విడాకులు తీసుకుంది. ఆ తర్వాతనుంచి పెళ్లి ఊసు ఎత్తలేదు మనీషా.  ఒంటరిగానే జీవితం కొనసాగిస్తుంది. కాగా ఆ బ్యూటీ గతంలో తన మాజీ భర్త గురించి సంచలన నిజాలు వెల్లడించింది. ఆరు నెలల్లోనే తనతో నరకం చూశానంటోంది. 

78

పెళ్లయ్యాక తన భర్తే తనకు శత్రువు గా మారాడని అంటోంది మనీషా.  తన భర్తకు తనపై ఎప్పుడూ కూడా ప్రేమ ఉండేది కాదనీ, నాకు కూడా తనపై ఎలాంటి ఇష్టం ఉండేది కాదని మనీషా కొయిరాల చెప్పుకొచ్చింది.అంతేకాకుండా పెళ్లైన కొద్ది రోజులకే తనకు తన భర్త శత్రువులా మారడాని.. ఓ స్త్రీ జీవితంలో ఇంతకంటే దారుణం ఇంకేం జరగాలని తెలిపింది. ఈ కారణాల వల్లే తన భర్తకు విడాకులిచ్చానని ఓ సందర్భంలో వెల్లడించింది బ్యూటీ. 
 

88

ఒకప్పుడు క్రిమినల్, ఒకే ఒక్కడు, బాబా,లాంటిసినిమాల్లో నటించిన ఈ బ్యూటీ. ఆతరువాత  దక్షిణాదిలో ఎక్కువగా కనిపించలేదు. అడపా దడపా బాలీవుడ్ సినిమాలు మాత్రం చేస్తోంది. ఇక  రీసెంట్‌గా హీరమండి వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది  ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories