అప్పట్లో కోవిడ్ ఆంక్షలు గట్టిగా ఉన్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరినీ రెండు నెలల ముందే కొరెంటైన్ చేశారు. తర్వాత హౌస్లోకి ప్రవేశ పెట్టారు. పెద్దగా పరిచయం లేని మొహాలు అరియనా, దివి, సోహెల్, మెహబూబ్, అఖిల్ సార్థక్, అలేఖ్య హారిక ఈ షోతో ఫేమ్ తెచ్చుకున్నారు. అరియనా, అలేఖ్య హారిక, సోహెల్, అఖిల్ సార్థక్, అభిజీత్ ఫైనల్ కి వెళ్లారు. వీరిలో అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యాడు.