నాని కాకపోయి ఉంటే తీసి కొట్టేవాడిని.. నాగార్జున షాకింగ్‌ కామెంట్స్.. చైతూ, అఖిల్‌కి ఆ జబ్బు లేదు..

Published : Jul 09, 2024, 04:42 PM IST

కింగ్‌ నాగార్జున నేచురల్‌ స్టార్‌కి సంబంధించిన షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన ఓ షాకింగ్‌ కామెంట్‌ కూడా చేశాడు.   

PREV
16
నాని కాకపోయి ఉంటే తీసి కొట్టేవాడిని.. నాగార్జున షాకింగ్‌ కామెంట్స్.. చైతూ, అఖిల్‌కి ఆ జబ్బు లేదు..
Nagarjuna

 కింగ్‌ నాగార్జున టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరు. ఆ నలుగురు సీనియర్లలో ఒకరిగా రాణిస్తున్నాడు. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఆయన `నా సామిరంగ` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు రెండు మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తున్నారు. హీరోగా మరో రెండు సినిమాలు లైన్లో పెడుతున్నారు.  

26

నాగార్జున వివాదాలకు దూరంగా ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ, ఎలా ఉండాలో బాగా తెలుసు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుసు. చాలా ప్రొఫేషనల్‌గా ఉంటారు. అయితే ఆయన ఓ హీరోపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయనకు అది డిసీజ్‌లా మారిపోయిందని, రిపైర్‌ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి అలవాటు తమ పిల్లలకు లేదని వెల్లడించారు. 
 

36

నాగార్జున కామెంట్‌ చేసింది నానిపైన. ఈ ఇద్దరు కలిసి `దేవదాసు` చిత్రంలో కలిసి నటించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. సినిమా యావరేజ్‌గానే ఆడింది. అయితే ఈ సందర్భంగా నాని గురించి షాకింగ్‌ కామెంట్‌ చేశారు నాగార్జున. సినిమా సెట్‌లో ఆయన గమనించిన విషయాలను బయటపెట్టారు. 
 

46

నానిలో ఉన్న బ్యాడ్‌ హ్యాబిట్‌ని బయటపెట్టాడు. బాగా సెల్‌ ఫోన్‌ చూసే అలవాటు ఉందట నానికి. ఎప్పుడూ ఫోన్‌లోనే మునిగి తేలుతుంటాడని చెప్పాడు. సెట్‌లో అంతా మామూలుగా ఉంటే నాని ఒక్కడే సెల్‌ ఫోన్‌చూస్తూ కనిపిస్తాడని చెప్పాడు. అది చాలా బ్యాడ్‌ హ్యాబిట్‌ అని, నాని హీరో కాబట్టి, నేనుగానీ, ప్రొడ్యూసర్లుగానీ ఏమనడం లేదు. అదే వేరే వాళ్లు అయితేనా ఫోన్‌ తీసుకుని పగలగొట్టేవాడిని అన్నాడు నాగ్‌. 
 

56

ఏంటిది అని అడిగితే, దాన్నుంచి బయటపడలేకపోతున్నాన్‌ సర్‌ అంటూ కవర్‌ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కూడా ఇలానే చేశాడు. ఏంటని అడిగితే ఐడియాస్‌ రాసుకుంటున్నా అన్నాడు, ఐడియాస్‌ లేవు, ఏం లేవు, ఆయనకు అది వ్యాధిలా మారిపోయిందన్నారు నాగ్‌. 
 

66

ఈ అలవాటు ఎవరికీ లేదని, నానిలో మాత్రమే ఉందన్నారు. తన కొడుకులు నాగచైతన్య, అఖిల్‌ గురించి చెబుతూ, ఈ అలవాటు మాత్రం వాళ్లకి లేదని, సెట్‌ లోనూ ఫోన్‌కి దూరంగానే ఉంటారని, ఇంట్లోనూ లిమిట్‌గానే వాడతారని తెలిపారు నాగ్‌. నానికి చెప్పే స్టేజ్‌ దాటిపోయిందని, రిపేర్‌ చేయాల్సిందే అంటూ సెటైర్లు పేల్చారు. `దేవదాసు` సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగ్‌ ఈ కామెంట్స్ చేశారు. ఈ సినిమా 2028లో విడుదలైంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories