
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమ నగలను దాచేసిన వల్లి వాటిని వేసుకొని మురిసిపోతూ ఉంటుంది. అదే సమయానికి తిరుపతి వస్తాడు. అవి కనిపించకుండా చీర కొంగును కప్పేసుకుంటుంది. తిరుపతి కాసేపు ఓవరాక్షన్ చేసి ‘నేను కనిపెట్టేసా.. నేను కనిపెట్టేసా’ అంటాడు. చివరికి నువ్వు మంచి కోడలివని కనిపెట్టేశా అని చెప్పి వెళ్ళిపోతాడు. వల్లీ బంగారు నగలు ఉన్నా కూడా వేసుకోలేని పరిస్థితి అని బాధపడుతూ లోపల దాచేసుకుంటుంది. ఇక్కడి నుంచి సీన్ సేనాపతి ఇంటికి మారుతుంది. సేనాపతి ఇంటికి వచ్చిన షావుకారు మీరు రోల్డ్ గోల్డ్ నగలు ఇచ్చారని చెబుతాడు. దానికి ప్రేమ తల్లి అవి అసలైన బంగారం నగలని, తమ కూతురివని చెబుతుంది. కానీ షావుకారు అవి రోల్డ్ గోల్డ్ వేనని నిరూపిస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. నగల విషయంలో ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో చెక్ చేసుకోమని చెప్పి వెళ్లిపోతాడు.
దీంతో సేనాపతి కోపంగా అసలు ఒరిజినల్ నగలు ఏమయ్యాయి? వాటి స్థానంలో ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఎలా వచ్చాయని? కంగారు పడతాడు. అప్పుడు భద్రావతి మాట్లాడుతూ ‘ఆరోజు మనకి ఒరిజినల్ నగలు పంపించలేదు ఈ రోల్డ్ గోల్డ్ నగలు పంపించి మనల్ని మాయ చేశాడు.. ఆ నగల్ని కొట్టేయడం కోసం ఎన్ని నాటకాలు ఆడాడు రామరాజు, మన ప్రేమను ట్రాప్ చేయించాడు ఈ విషయం తెలియక పిచ్చిది గుడ్డిగా నమ్మి మోసపోయింది. రామరాజును వదిలిపెట్టను’ అని భద్రావతి అంటుంది.
రోల్డ్ గోల్డ్ నగలన్నీ పట్టుకొని భద్రావతి, సేనాపతి కోపంగా రామరాజును బయటికి రమ్మని అరుస్తారు. దీంతో రామరాజు ఫ్యామిలీ అంతా బయటకు వస్తుంది. భద్రావతి కోపంగా ‘ఏం బతుకురా.. నీది డబ్బులు కావాలనుకుంటే మమ్మల్ని అడిగితే నీ మొఖాన కొట్టే వాళ్ళం కదా.. డబ్బుల కోసం ఎంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. డబ్బు కోసమే నువ్వు ఆరోజు నా చెల్లిని మాయ చేసి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. డబ్బు కోసమే కదా నీ చిన్న కొడుకుతో నా మేనకోడల్ని ట్రాప్ చేయించావు’ అని అంటుంది. ఈలోపు వేదవతి కల్పించుకొని బుద్ధి లేకుండా మాట్లాడకు అని భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది. మీ డబ్బుల కోసం మేము ఎప్పుడూ కక్కుర్తి పడలేదు, ఆశపడలేదు అని చెబుతుంది వేదవతి.
భద్రావతి మాట్లాడుతూ ‘డబ్బు కోసం ఆశపడకపోతే నా మేనకోడలి నగలు కొట్టేయాలని ఎందుకు స్కెచ్ వేస్తారు’ అని అంటుంది. ‘ప్రేమ నగల్ని ఆరోజు మీకే ఇచ్చేసాము కదా.. మరి నగలు కొట్టేయడానికి ప్లాన్ వేసామని నిందలు వేస్తున్నావేంటి’ అని వేదవతి ప్రశ్నిస్తుంది. భద్రావతి అతిగా మాట్లాడుతూ ఈ పనోడ్ని పెళ్లి చేసుకుని నువ్వు కూడా నాటకాలు ఆడడం బాగా నేర్చుకున్నావని చెల్లిని అంటుంది. మధ్యలో తిరుపతి కల్పించుకొని ఆరోజు నగలు నేనే కదా మీకు తీసుకొచ్చి ఇచ్చాను, మీరందరూ ఉన్నప్పుడే ఇచ్చాను కదా మరి ఇప్పుడు రామరాజు బావ నగలు కొట్టేయడానికి ప్లాన్ వేశాడని మాట్లాడుతున్నారెందుకని ప్రశ్నిస్తుంది. నర్మద కూడా అదే విషయాన్ని చెబుతుంది. ‘నగలు పంపించారా? ఈ నగలేనా మీరు పంపించారు’ అంటూ ఆ రోల్డ్ గోల్డ్ నగలను నేలకేసి కొడుతుంది భద్రావతి. ఇవన్నీ గిల్టు నగలు అని చెబుతుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
సేనాపతి మాట్లాడుతూ ‘ప్రేమ ఒరిజినల్ నగలను దాచిపెట్టి రోల్డ్ గోల్డ్ నగలు పంపించి ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు’ అని అంటాడు. పూజలో పెట్టడం కోసం నగలను మెరుగుకు పంపిస్తే.. రోల్డ్ గోల్డ్ నగలని తేలింది అని భద్రావతి చెబుతుంది. ప్రేమతో ‘నీకింకా అర్థం కావడం లేదా? ఈ నగల కోసమే నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ నాటకాల వెనుక అసలు సూత్రధారి, పాత్రధారి రామరాజు’ అని అంటుంది. ‘రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను, మా నగలు మాకు తెచ్చి ఇవ్వకపోతే జైల్లో చిప్పకూడు తినిపిస్తా’ అని రామరాజుకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది భద్రావతి. రామరాజు భద్రావతి ఇచ్చిన వార్నింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
రామరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ‘నాకేంటి అవమానాలు. ఆరోజే ప్రేమ నగలు వారికిచ్చేసాం కదా. అవి గిల్టు నగలు అంటారేంటి? అసలు ఒరిజినల్ నగలు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి?’ అని అరుస్తాడు. వల్లి భయంతో నగల మార్చింది తానేనని బయట పడిపోతుందేమోనని భయంతో ఉంటుంది. ఈ లోపు వల్లీ కల్పించుకొని ప్రేమపై నింద వేసేందుకు ప్రయత్నిస్తుంది. ‘ఆ నగలను స్వయంగా పంపించింది ప్రేమే. ఇంకెవరు మధ్యలో ముట్టుకోలేదు. అంటే తప్పయినా, ఒప్పయినా, మంచైనా, చెడైనా ప్రేమకే తెలియాలి కదా. మరొక్కసారి మావయ్య గారు చొక్కా చింపకూడదనే చెబుతున్నా. ఇప్పుడు ప్రేమకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న ఆశయం ఉంది. దానికి లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది కదా అందుకే నగలన్నీ దాచుకొని అమ్ముకొని ఏమైనా...’ అని ఆపేస్తుంది.దీంతో ప్రేమకి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముక్సిపోతుంది.