మెగా ఫ్యామిలీ హీరోలకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఓ కమెడియన్ అయితే రామ్ చరణ్ కొడుతున్నా సరే.. చిరంజీవిగారి అబ్బాయితో తన్నులు తింటున్నాను అని సంతోషించాడట. ఇంతకీ ఎవరా నటుడు.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ కు వచ్చాడు. అయితే చిరంజీవిని చూసి ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు. మెగా ఇన్స్పిరేషన్ తో నటులుగా మారి, స్టార్ డమ్ సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఇప్పటికీ చిరంజీవి అంటే అదే భక్తి భావంతోనే ఉంటారు. ఇక ఇండస్ట్రీలో చిన్నా చితకా నటులు అయితే చిరంజీవిని దేవుడిలా కొలుస్తుంటారు. ఆయనతో ఒక్క సీన్ అయినా నటించాలని, మెగా వారసులలో ఎవరో ఒకరితో యాక్ట్ చేసినా చాలు అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు.
26
చిరంజీవికి వీరాభిమాని
మెగాస్టార్ ను కానీ.. ఆయన తనయుడు రామ్ చరణ్ ను కానీ కలిస్తే చాలు అనుకునే నటులు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మెగా హీరోల సినిమాల్లో చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు ఎంతో సంతోషిస్తారు. అలాంటి నటులలో ఒకడు కమెడియన్ జోష్ రవి. టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన రవి.. ఆతరువాత కాలంలో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు సాధించాడు రవి. అయితే జోష్ రవి ఇండస్ట్రీకి చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని వచ్చాడు. మెగాస్టార్ ను అద్భుతంగా ఇమిటేట్ కూడా చేయగలడు.
36
రామ్ చరణ్ తో తన్నులు తిన్న రవి..
జోష్ రవి యాక్టింగ్ చూసి ముచ్చటపడిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మగధీర సినిమాలో పిలిచి మరీ ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఈసినిమాలో కాజల్ ను టీజ్ చేస్తూ.. ఏడిపించే సీన్. ఆ సీన్ లో హీరోయిన్ ను ఏడిపించినందుకు హీరో రామ్ చరణ్ రవిని పడేసి కొడుతుంటాడు. చరణ్ కొడుతుంటే బాగా ఎంజాయ్ చేశాడట జోష్ రవి. తన్నులు తింటున్నాం అన్న సంగతి మర్చిపోయి.. చిరంజీవిగారి అబ్బాయ్ కొడుతున్నాడు.. ఆయన మనల్ని టచ్ చేస్తున్నాడు.. అని గొప్ప ఫీలింగ్ లో ఉండిపోయాడట రవి. అంతే కాదు సీన్ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాడట ఈ కమెడియన్. షాట్ మధ్యలో రామ్ చరణ్ దెబ్బ తగులుతుందా అని అడిగితే.. ''పర్లేదు సార్.. మీరు కొట్టండి సార్ కొట్టండి'' అని తెగ ఎంజాయ్ చేశాడట జోష్ రవి. ఈ విషయాలను రవి ఓ ఇంటర్వ్యూలో చాలా హ్యాపీగా చెప్పుకొచ్చాడు.
మెగా అభిమానుల్లో జోష్ రవిలాంటివారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం స్టార్లు గా వెలుగు వెలుగుతున్న నటులు, దర్శకులలో చిరంజీవి అభిమానులు చాలామంది ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా, బాబీ, హరీష్ శంకర్, మోహర్ రమేష్ లాంటి దర్శకులు ఎందరో చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. సందీప్ రెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో మెగాస్టార్ ఫోటో ఫ్రేమ్ ఉండటం అందరికి తెలిసిందే. ఇక సునిల్ లాంటి నటులు మెగాస్టార్ అడుగుజాడల్లో నడిచారు. ఇప్పటికీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న యూత్ కు చిరంజీవి జీవితం ఆదర్శంగా నిలుస్తోంది.
56
70 ఏళ్ల వయస్సులో తగ్గేదే లే..
సాధారణంగా 60 ఏళ్లు దాటితే.. శరీరంలో శక్తి తగ్గిపోతుంది. రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లే అంటున్నాడు. ఏదో సాధారణ సినిమాలు చేయడం లేదు.. డాన్స్, యాక్షన్, ఎమోషన్ ఏ విషయంలోను తగ్గడంలేదు చిరంజీవి. ఇప్పటికీ అదే గ్రేస్, అదే స్టైల్, అదే ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డేకి రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన చికిరి సాంగ్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.
66
జోష్ రవి మూవీ కెరీర్..
జోష్ రవి టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. జబర్థస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రవికి జోష్ సినిమాతో ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది. ఆతరువాత కాలంలో రవి తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు రవి. ఈమధ్య కాలంలో రవి పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతంలో వచ్చినంతగా అవకాశాలు కూడా జోష్ రవికి రావడంలేదు.