రంగస్థలం, పెద్దిలా ఉండదు.. రాంచరణ్, సుకుమార్ మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటో తెలుసా.. ఇది వేరే లెవల్

Published : Nov 27, 2025, 09:16 AM IST

రాంచరణ్ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రం పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కింది. 

PREV
15
పెద్ది మూవీ సందడి 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండియా వైడ్ గా బజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన చికిరి సాంగ్ సంచలనాలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అభిమానులు చికిరి సాంగ్ పై రీల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంతలోనే రాంచరణ్ నెక్స్ట్ మూవీపై బజ్ మొదలైపోయింది. 

25
రాంచరణ్, సుకుమార్ సినిమాపై క్రేజీ న్యూస్ 

రాంచరణ్ 17వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. చాలా కాలం క్రితమే ఇది కంఫర్మ్ అయింది. వీరిద్దరి తొలి కలయికలో వచ్చిన రంగస్థలం మూవీ టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక రెండవసారి సుకుమార్ రాంచరణ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రంగస్థలం చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ ఫిలిం గా తెరకెక్కింది. ఇప్పుడు చిత్రం నటిస్తున్న పెద్ది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోంది. 

35
మోడ్రన్ కథాంశంతో.. 

అయితే ఆర్సీ 17 చిత్రం మాత్రం ప్రజెంట్ టైమ్స్ లోనే మోడ్రన్ కథాంశంతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మైత్రి నిర్మాత రవి శంకర్ ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చేశారు. రాంచరణ్, సుకుమార్ ల చిత్రం సమకాలీన కథతోనే ఉండబోతోంది అని అన్నారు. ఈ మూవీలో రాంచరణ్ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

45
పెద్ది పైనే ఆశలు 

ఈ ఏడాది రాంచరణ్ అభిమానులకు గేమ్ ఛేంజర్ చిత్రం ద్వారా అతి పెద్ద డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ఆ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. దీనితో చరణ్ అభిమానులంతా పెద్ది చిత్రంపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే సుకుమార్ చిత్రం ప్రారంభం కానుండడం మరో గుడ్ న్యూస్. 

55
వచ్చే ఏడాది సుకుమార్,చరణ్ మూవీ ప్రారంభం 

 ప్రస్తుతం సుకుమార్ ఆర్సీ 17 స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆశించవచ్చు. సుకుమార్ చివరగా పుష్ప 2 తో ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం అందుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories