
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో భాగ్యం.. అమూల్య నిశ్చితార్థాన్ని చెడగొట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని కూతురితో చెబుతుంది. వల్లి తనకేమీ చెప్పొద్దని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. విశ్వక్ ఇచ్చిన ఫోటోలను పట్టుకొని భాగ్యం ఇటూ అటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమూల్య విశ్వా కలిసి ఉన్న ఫోటోలను నిశ్చితార్థంలో పెట్టాలని, కానీ అవి పెట్టింది మనమే అని తెలియకూడదని ఇడ్లీ బాబాయ్ కి చెబుతుంది. ఇడ్లీ బాబాయ్ ఆ పని చేసేందుకు ఒప్పుకుంటాడు. వాటిని కావాలనే నిశ్చితార్థం జరిగే చోట పడేస్తాడు. వాటిని ఒక పాప తీసి చూస్తుంది. వాటిని తీసి ‘పిన్ని ఫోటోలు, పిన్ని పక్కన ఎవరో ఉన్నారు ఏంటి? వాటిని పిన్నికి ఇచ్చేస్తాను’ అంటూ వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం అది చూసి చాలా ఆనందిస్తుంది.
ఒకపక్క నిశ్చితార్థం జరుగుతూ ఉంటే వల్లి కనిపించకపోయేసరికి ప్రేమ, నర్మద గాభరాతో వల్లిని వెతుకుతూ ఉంటారు. ఈ లోపు ఫోటోలు దొరికిన పాప ఆ ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు ఆ ఫోటోలు చూపించమని అడుగుతారు. ఆ ఫోటోలను ప్రేమ చూసేస్తుంది. ఆ పాప నుంచి ఆ ఫోటోలను తీసుకునేందుకు ప్రేమ ప్రయత్నిస్తుంది. మధ్యలో ప్రేమను ధీరజ్ అడ్డుకుంటాడు. కావాలనే చిన్న చిన్న గొడవలు పడతారు ఇద్దరూ. మరోపక్క ప్రేమ ఆ ఫోటోలు ఎవరు చూస్తారోనని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపు నర్మద రావడంతో ప్రేమ.. పాప చేతిలో అమూల్య విశ్వల ఫోటోలు ఉన్నాయని చెబుతుంది. దీంతో నర్మద, ప్రేమ కూడా టెన్షన్ పడతారు.
ఇద్దరూ కలిసి నిశ్చితార్థం జరిగే చోటుకి వస్తారు. ఈ లోపు పాప కింద పడిపోయి ఆ ఫోటోలను పెళ్లి కొడుకు ముందు పడేస్తుంది. వాటిని ఎవరు చూస్తారోనని ఒకపక్క ప్రేమ, నర్మద.. కంగారు పడుతూ ఉంటారు. ఆ ఫోటోలు పెళ్లికొడుకు వారు చూడాలని భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోపు కావాలనే వల్లి ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఆ ఫోటోలు నేరుగా పెళ్లి కొడుకు తండ్రి దగ్గర పడతాయి. అది చూసి వల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం ఆనంద పడుతూ ఉంటారు.
నిశ్చితార్థంలో భాగంగా పెళ్లికొడుకు అమూల్యకు ఉంగరం తొడుగుతాడు. అమూల్య కూడా పెళ్లి కొడుకుకి నిశ్చితార్థం ఉంగరం తొడుగుతుంది. ఈ లోపు నర్మద వెళ్లి ఆ ఫోటోల పై స్వీటు పళ్లెం పెట్టేస్తుంది. ఈ లోపు నిశ్చితార్థం పూర్తవుతుంది. నర్మద తెలివిగా ఫోటోలను స్వీటు పళ్ళెంతో సహా తీసేస్తుంది. అదంతా చూసి భాగ్యం, వల్లి. ఇడ్లీ బాబాయ్ షాక్ అవుతారు.
నిశ్చితార్థం సక్సెస్ ఫుల్ గా అవ్వడంతో రామరాజు కుటుంబం ఆనందంలో మునిగి తేలుతుంది. ముగ్గురు అన్నదమ్ములు, తిరుపతి కలిసి పాటలకు డ్యాన్సులు వేస్తారు. అలాగే వల్లి, నర్మద, ప్రేమ కూడా వారి భర్తలకు తోడుగా డాన్సులు వేస్తారు. డాన్సులు పూర్తయ్యాక వనజ మాట్లాడుతూ ‘మీతో సంబంధం కలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నయ్యగారు. నిశ్చితార్థమే ఘనంగా చేశారు. అబ్బాయి అమ్మాయి కూడా ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది’ అని రామరాజుతో అంటుంది. అప్పుడు రామరాజు మీలాంటి మంచి కుటుంబం మా అమ్మాయిని ఇష్టపడడం మా అదృష్టం అని అంటాడు రామరాజు. దాంతో నీరజ మీరు ఎంతో కష్టపడి ఈ ఊర్లో గొప్ప పేరు సంపాదించుకున్నారు, మీ గురించి చెడుగా మాట్లాడే వారు ఈ ఊర్లో ఎవరున్నారు. మాకు కూడా సంతోషమే అని అంటుంది.
ఈ లోపు 20 లక్షల రూపాయలు ఇచ్చి రామరాజుకు ఉంచమని చెబుతుంది వనజ. దాంతో అందరు షాక్ అవుతారు. నగలు కొని తమ కోడలికి పెట్టమని అంటుంది. దానికి రామరాజు తామే నగలుకొని మా అమ్మాయికి పెడతాం కదా అని అంటాడు. అప్పుడు వనజ తనకు కాబోయే కోడలికి తన సొంత డబ్బుతోనే నగలు కొనివ్వాలని మొక్కుకున్నట్టు చెబుతుంది. దీంతో రామరాజు ఆ డబ్బులు తీసుకుంటాడు.
ఈలోపు కామాక్షి మాట్లాడుతూ మీ ఆచారంలో పెళ్లికూతురికే కానీ పెళ్లికూతురు అక్కకి ఏమైనా ఇస్తారా అని అడుగుతుంది. పెళ్లిలో పెళ్లికూతురుతో పాటు నీకు కూడా బోలెడు కానుకలు ఉంటాయమ్మ అని చెబుతుంది వనజ. పెళ్లివారు అక్కడినుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. వారిని రామరాజు కుటుంబం అంతా దగ్గరుండి సాగనంపుతుంది. ఇదంతా విశ్వక్, భద్రావతి తమ ఇంటి దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. దాంతో నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.