2900 కోట్ల ఆస్తి , సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్, కానీ సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ లో నివసిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Jan 19, 2026, 09:16 AM IST

సాధారణంగా స్టార్ హీరోలు లగ్జరీ బిల్డింగ్స్ లో నివసిస్తుంటారు. పెద్ద పెద్ద భవంతులు, కాస్ట్లీ కార్లు, బ్రాండెడ్ ఐటమ్స్ ను వాడుతుంటారు. కానీ 2900 కోట్ల ఆస్తులు ఉన్నా.. ఓ హీరో మాత్రం సింపుల్ గా సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటున్నాడు. ఇంతకీ ఎవరా హీరో?

PREV
15
స్టార్ హీరోల లగ్జరీ లైఫ్..

కెరీర్ బిగినింగ్ లో ఎన్ని ఇబ్బందులు పడ్డా.. స్టార్ డమ్ వచ్చిన తరువాత హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎవరైనా.. లగ్జరీ జీవితానికి అలవాటు పడుతుంటారు. భారీ బంగ్లాలు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం వారిని చుట్టుముట్టడం సాధారణమే. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల విషయంలో అయితే ఈ లైఫ్‌స్టైల్ మరింత హైలైట్‌గా కనిపిస్తుంది. బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా వంటి ఖరీదైన ఇళ్లు అందుకు ఉదాహరణలు. అయితే ఈ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా జీవిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.

25
సల్మాన్ ఖాన్ ఆస్తి, రెమ్యునరేషన్..

దాదాపు 40 ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతున్న సల్మాన్ ఖాన్, టాప్ హీరోలలో ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ఈ హీరో, ఒక్క సినిమాకు రూ.50 నుంచి 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆయన సుమారు రూ.2900 కోట్ల ఆస్తిని సంపాదించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ లగ్జరీ జీవితం వైపు మొగ్గు చూపడం లేదు.

35
1BHK ఫ్లాట్‌లో సల్మాన్ నివాసం..

బాలీవుడ్ స్టార్ హీరోలు ముంబయిలో భారీ బంగ్లాలు, సీ ఫేసింగ్ విలాల్లో నివసిస్తుంటే, సల్మాన్ ఖాన్ మాత్రం గత నాలుగు దశాబ్దాలుగా ముంబయి బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఒక చిన్న 1BHK ఫ్లాట్‌లోనే నివసిస్తున్నాడు. సల్మాన్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులంతా ఇదే అపార్ట్‌మెంట్‌లో వివిధ అంతస్తుల్లో ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ 1BHK ఫ్లాట్‌లో ఉండగా, ఆయన తల్లిదండ్రులు పై అంతస్తులో ఉన్న 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.

45
తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని

ఇంత సంపాదిస్తూ కూడా సల్మాన్ ఖాన్ చిన్న ఇంట్లోనే ఉండటానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలన్న కోరికేనని తెలుస్తోంది. కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడపడం సల్మాన్ ఖాన్‌కు ఎంతో ఇష్టమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు ఆయన షూటింగ్స్‌కు సైకిల్ మీదే వెళ్లేవాడట. సైక్లింగ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం ఉండడంతో, సైకిల్ వెనకే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది వచ్చేవారని సమాచారం.అయితే ఇటీవల సల్మాన్ ఖాన్‌కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో, ప్రస్తుతం ఆయన కఠిన భద్రత మధ్యనే ఉంటున్నారు.

55
సల్మాన్ ఖాన్ కు ప్రభుత్వ భద్రత..

సల్మాన్ ఖాన్ తర సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ బాల్కానీకి కూడా బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ తో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. బుల్లెట్‌ప్రూఫ్ కారు ఉపయోగిస్తూన్నారు. లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను చంపేస్తాం అని పబ్లిక్ గా బెదిరించడంతో..ప్రభుత్వం సల్మాన్ కు వై కేటగిరీ బద్రతను కల్పిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా.. టైట్ సెక్యూరిటీతో ప్రయాణిస్తున్నారు. బంగ్లా లేకపోయినా, పణ్వెల్‌లో ఉన్న 150 ఎకరాల ఫామ్‌హౌస్‌లో ప్రతి ఏడాది కొన్ని నెలలు గడుపుతుంటారు సల్మాన్. అక్కడే పార్టీలు చేసుకుంటారు. సల్మాన్ వ్యవసాయ పనులు కూడా చేస్తుంటాడు.

Read more Photos on
click me!

Recommended Stories