Rithu Chowdary క్యారెక్టర్‌ బ్యాడ్‌ గా వస్తుంది, మేం ఓటు వేయం.. రీతూ మదర్‌కి దారుణమైన అవమానం

Published : Jan 19, 2026, 08:30 AM IST

Rithu Chowdary: రీతూ చౌదరీ చుట్టూ ఆ మధ్య చాలా వివాదాలు నడిచాయి. దీంతో తన అమ్మ దారుణమైన అవమానాలు ఫేస్‌ చేసిందట. ఓట్‌ వేయండని అడిగితే అమ్మాయి క్యారెక్టర్‌ బ్యాడ్‌ అంటూ మాట్లాడారట. 

PREV
14
రీతూ చౌదరీ చుట్టూ వివాదాలు

ఇటీవల బిగ్‌ బాస్‌ షోతో విశేషమైన గుర్తింపు, పాపులారిటీ సొంతం చేసుకున్న రీతూ చౌదరీకి సంబంధించి ఇటీవల అనేక వివాదాలు వినిపించాయి. బిగ్‌ బాస్‌ షోకి వెళ్లడానికి ముందు ఓ భూ కుంభ కోణంలో ఆమె పేరు వినిపించింది. అది పెద్ద రచ్చ అయ్యింది. బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాక మరో వివాదం నడిచింది. యంగ్‌ హీరోతో డేటింగ్‌లో ఉందనే వార్తలొచ్చాయి. ఆ హీరో భార్య అనేక ఆరోపణలు చేసింది. ఇవన్నీ రీతూ చౌదరీపై బయట తీవ్రమైన నెగటివిటీని క్రియేట్‌ చేశాయి.

24
హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కావాలనుకున్న రీతూ

ఎంత నెగటివిటీ ఉన్నా రీతూ చౌదరీ 13 వారాలు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా రాణించింది. టాప్‌ 5లోనూ ఉండాల్సిన కంటెస్టెంట్‌. కానీ ముందే హౌజ్‌ని వీడింది. అయితే తాజాగా ఆమె బిగ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయాలను పంచుకుంది. తనకు ఎదురైన సంఘటనలను వెల్లడించింది. ఫైర్ స్టోర్మ్ వచ్చినప్పుడు చాలా లో అయ్యిందట. డీమాన్‌ పవన్‌ని, తనని విడికొట్టేందుకు వాళ్లు ప్రయత్నించిన నేపథ్యంలో చాలా కుంగిపోయిందట. తాను ఏం తప్పు చేశానని బాధపడిందట. అది తట్టుకోలేక ఎలిమినేట్‌ అయితే బాగుండు అనుకుందట.

34
రీతూ చౌదరీ అమ్మకి అవమానాలు

అయితే తనకంటే తన అమ్మ ఎక్కువగా బాధపడిందట. తన గురించి ఇంత నెగటివిటీ వస్తుందని ఆమె ఎమోషనల్‌ అయ్యిందట. తన బిడ్డ హౌజ్‌నుంచి బయటకు రావాలని, అందులో ఉండొద్దు అనుకుందట. అంతేకాదు తెలిసిన వాళ్ల నుంచే చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. ఓటింగ్‌ కోసం తెలిసిన వాళ్లకి, బంధువులకు ఫోన్‌ చేస్తే చాలా మంది లిఫ్ట్ చేయలేదట. కొందరు లిఫ్ట్ చేసి మీ అమ్మాయి క్యారెక్టర్‌ బ్యాడ్‌గా వస్తుంది, మేం సపోర్ట్ చేయమని మొహం మీదే చెప్పారట. ఇలాంటి దారుణమైన పరిస్థితులను అమ్మ ఫేస్‌ చేసిందని చెప్పింది రీతూ చౌదరీ. అయితే ఇలాంటి అవమానాలు ఫేస్‌ చేసినా జనాలు తనని బాగా లవ్‌ చేశారని, స్వతహాగా ఓట్లు వేసి తనని 13 వారాలు ఉండేలా చేశారని, తన నిజాయితీ ఏంటో వాళ్లకి అర్థమయ్యిందని తెలిపింది రీతూ.

44
కర్మ తిరిగి కొడుతుంది

తన క్యారెక్టర్‌ బ్యాడ్‌గా చేయడంపై ఆమె స్పందిస్తూ, తానేంటో తనకు తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, అమ్మకి తెలుసు. వాళ్లు ఎవరో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కావాలని బ్యాడ్‌ చేయాలనుకుంటే కర్మ తిరిగి కొడుతుంది. అదే తాను నమ్ముతానని, అందుకే సైలెంట్‌గా ఉన్నట్టు చెప్పింది రీతూ చౌదరీ. ఒకడు ఇదే కరెక్ట్ అని తాను నమ్మితే, నేను వచ్చి ఏం చెప్పినా నమ్మడు, తనదే రైట్ అనుకుంటాడు. అలాంటి వాడి కోసం నేను బయటకు వచ్చి మాట్లాడటం ఎందుకు అని వెల్లడించింది రీతూ. అంతేకాదు నాన్న చనిపోయాక అంత దూరమయ్యారని, చుట్టాలు ఎవరూ లేరని, తనకు ఎవరూ ఫోన్‌ చేయరని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రీతూ చౌదరీ. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories