Illu Illalu Pillalu Today Episode Dec 26: రోడ్డుపై పడి కొట్టుకున్న రెండు కుటుంబాలు, విశ్వక్ కోసం అమూల్య పచ్చి అబద్ధం

Published : Dec 26, 2025, 09:12 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 26: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అమూల్య ప్రేమ విషయంపై రామరాజు ఇంట్లో గొడవ అవుతుంది. చివరికి రెండు కుటుంబాలు కొట్టుకుంటాయి. అమూల్య విశ్వక్ కోసం అబద్ధం చెబుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
15
రామరాజు ఆవేదన

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు చాలా ఆవేదనగా అమూల్యతో మాట్లాడుతాడు. ‘గుండెల మీద తన్నే పిల్లలు నాకు పుట్టారు. వాడిని ప్రేమించే ముందు ఈ నాన్న నీకు గుర్తు రాలేదా? పాతికేళ్లుగా నాపై పగ తీర్చుకునేందుకు ఆ కుటుంబం వేచి చూస్తోంది. నా చావును కూడా కోరుకుంటుంది. అలాంటి వ్యక్తితో ప్రేమ ఏంటి? నన్ను గుండెల మీద తన్నడానికి నీకు కూడా మనసు ఎలా వచ్చింది? వాణ్ని నువ్వు ప్రేమించే ముందు మీ నాన్న నీకు ఎందుకు గుర్తు రాలేదా? వాళ్ళు మీ నాన్నకు చేసిన అవమానాలు గుర్తు రాలేదా?’ అంటూ చాలా బాధపడుతూ మాట్లాడతాడు రామరాజు. దీంతో అమూల్య ఏడుస్తూ ఉంటుంది.

 ‘నా కూతురు నాకు తలవంపులు తీసుకురాదు, నన్ను తలవంచుకునేలా చేయదు అని నమ్మకం ఉండేది.. కానీ ఇప్పుడు నువ్వు కూడా నా పరువును తగలబెట్టేసావు, నడిరోడ్డు మీద నిల్చోబెట్టేసావు’ అంటూ రామరాజు చాలా ఎమోషనల్ గా కింద కూర్చుండిపోతాడు. దీంతో అందరూ బాధపడతారు. ధీరజ్ మాట్లాడుతూ ‘అనాల్సింది అమూల్యను కాదు..తనని ట్రాప్ చేసిన విశ్వక్ గాడిని’ అంటాడు. తర్వాత సాగర్ మాట్లాడుతూ ‘నువ్వు ఏడవడం కాదు నాన్న వాడిని ఏడిపిస్తాం’ అంటూ ఎదురింటికీ పరిగెడతారు ధీరజ్, సాగర్. దీంతో వాళ్ళని ఆపేందుకు మిగతా కుటుంబ సభ్యులు అంతా వెళతారు.

25
విశ్వను కొట్టిన ధీరజ్ సాగర్

ధీరజ్, సాగర్ కలసి ఎదురింటిలోకి దూసుకుని వెళతారు. వాళ్లని ఆపేందుకు తిరుపతి కూడా వెళ్తాడు. ఇల్లంతా తిరుగుతూ గోల గోళ చేస్తారు. అడ్డొచ్చిన సేనాపతిని తోసేస్తారు. విశ్వక్ కిందకి వస్తాడు. అతడిని పట్టుకొని ధీరజ్, సాగర్ కలిపి కొడతారు. తిరుపతి ఆపుతున్నా ఆగరు. విశ్వను బయటకు ఈడ్చుకొచ్చి బాగా తంతారు. ఎంతమంది ఆపుతున్నా వీరిద్దరూ ఆగరు. ఇదంతా అమూల్య చూసి ఏడుస్తుంది. అప్పుడు ప్రేమ... ధీరజ్ ను అడ్డుకుంటుంది. ‘తప్పు మా అన్నయ్యది కాదు అమూల్యదే. తప్పు చేసింది మీ అమూల్య అయితే మా అన్నయ్యని చంపేస్తానంటావ్ ఏంటి’ అని ప్రేమ వాళ్ళ అన్నయ్యకు సపోర్టుగా మాట్లాడుతుంది. అయినా సరే అమూల్య నోరు విప్పి మాట్లాడదు. ధీరజ్.. ప్రేమను తోసేయడంతో మళ్లీ విశ్వక్, ధీరజ్ కొట్టుకుంటారు. ఈలోపు రామరాజు వచ్చి తప్పు నాకు కూతురుదా? ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రేమని నిలదీస్తాడు.

35
అబద్ధం చెప్పిన అమూల్య

అప్పుడు ప్రేమ ‘మీరు నమ్మినా, నమ్మకపోయినా తప్పు అమూల్యదే. అమూల్య మొదట మా అన్నయ్యను ప్రేమించింది. వాడు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పింది. అంతే తప్ప మా అన్నయ్య అమూల్యను ట్రాప్ చేయలేదు. కావాలంటే అమూల్యని అడగండి’ అంటుంది. అప్పుడు వేదవతి కోపంగా అమూల్యని చేయి పట్టుకుని లాక్కొచ్చి తప్పంతా నీదే అంటుంటే నువ్వు మాట్లాడవేమి? నువ్వే ప్రేమించావా? అని గట్టిగా అడుగుతుంది. అమూల్య మొదట నేనే ప్రేమించానని అబద్ధం చెబుతుంది. దీంతో రామరాజు కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. మరో పక్క విశ్వ, భద్రావతి మాత్రం ఆనందంతో తేలిపోతారు. అప్పుడు విశ్వ తాను చేసిన ప్లాన్ గుర్తు చేసుకుంటాడు. రెండు కుటుంబాలు కలిసేందుకు నువ్వే నన్ను ప్రేమించావని మీ వాళ్లకు చెప్పాలి అని ముందే అమూల్యను ప్రిపేర్ చేసినది గుర్తొచ్చి ఆనందంతో నవ్వుకుంటాడు. 

వేదవతి అమూల్యను బాగా కొడుతుంది. అది చూసి సేనాపతి కుటుంబం ఆనందపడుతుంది. సేనాపతి దొరికిన అవకాశాన్ని వాడుకుంటాడు. ‘ఏం కూతురిని కన్నావురా.. మీ పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటావు, నీ పెంపకం గురించి గొప్పగా చెప్పుకుంటావు..ఇదేనా నీ పెంపకం, ఎలాగూ నీకు మగపిల్లలను పెంచడం చేతకాలేదు, కనీసం ఆడపిల్లను పెంచడం కూడా నీకు చేతకాలేదు కదరా’ అని అంటాడు. అది విని రాజరాజు చాలా కుంగిపోతాడు. సేనాపతి నోటికి వచ్చినట్టు రామరాజును తిడుతూనే ఉంటాడు. ఏం బతుకు రా నీది ఛీ అని ఘోరంగా అవమానించి సేనాపతి కుటుంబం ఇంట్లోకి వెళ్లిపోతుంది.

45
భద్రావతి ఆనందం

ఇక్కడ నుంచి సీన్ భద్రావతి దగ్గరికి మారుతుంది. జరిగిన గొడవ తలుచుకొని భద్రావతి కుటుంబం ఆనందంలో ఉంటుంది. విశ్వ, భద్రావతి కలిసి తాము చేసిన పనిని తలుచుకొని ఆనంద పడుతూ ఉంటారు. అమూల్య విషయంలో ఇప్పటికే ఆ రామరాజు గుండె సగం పగిలిపోయి ఉంటుంది, ఇక అమూల్య మెడలో నేను తాళి కడితే వాడు కచ్చితంగా ఛస్తాడు అంటాడు విశ్వ. రామరాజు మీద పగ తీర్చుకోవడంతోపాటు, నీ చెల్లి ప్రేమను ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం, ప్రేమ ఎదురు తిరిగింది, ప్రస్తుతం ప్రేమ ఆ ఇంట్లో ఏకాకి అయ్యి ఉంటుంది, ఈ అవకాశాన్ని మనం ఆయుధంగా వాడుకొని ప్రేమని ఇంటికి తెచ్చుకోవాలి అని చెబుతుంది భద్రావతి.

55
నర్మదను బతిమిలాడిన ప్రేమ

నర్మద వంట చేస్తుంటే ప్రేమ అక్కడికి వస్తుంది. ప్రేమ ఎంత పిలిచిన నర్మదా పలకదు. ‘అక్కా ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకుంటావు. నా గురించి ఆలోచిస్తావు. కానీ ఈ విషయంలో నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వు కూడా నామీద కోపంగా ఉన్నావు. మా అన్నయ్య మీద ఇంట్లో వాళ్ళందరికీ ఒక చెడ్డ అభిప్రాయం ఉంది. అందుకనే మా అన్నయ్య అమూల్యను ట్రాప్ చేశాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మా అన్నయ్య తప్పులేదు అక్కా’ అని వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా వల్లి వింటూ ఉంటుంది. అసలు విషయం తెలుసుకోకుండా మా అన్నయ్యను అందరూ కొడుతూ, తిడుతూ ఉంటే ఒక చెల్లిగా నాకు కోపం రాదా అని అంటుంది ప్రేమ. 

నర్మదా మాట్లాడుతూ ‘నేను బయటిదాన్ని. ఇది మీ కుటుంబ విషయం. నేనెవరిని జోక్యం చేసుకోవడానికి’ అని అంటుంది. తనతో మాట్లాడమని నర్మదను ఎంతో బతిమిలాడుకుంటుంది ప్రేమ. కానీ నర్మదా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన వల్లి చాలా ఆనందంలో ఉంటుంది. తన గదిలోకి వెళ్లి డాన్సులు వేస్తుంది. ప్రేమ, నర్మద విడిపోవడం వల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories