చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం, రిలీజ్ రోజే చనిపోవాలని అనిపించింది.. నిర్మాత చేసిన మిస్టేక్ వల్లే డిజాస్టర్

Published : Dec 26, 2025, 07:27 AM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం ఒకటి ఊహించని పరాజయం చవిచూసింది. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో వివరిస్తూ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
చిరంజీవి మృగరాజు

మూవీ  మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అదే విధంగా డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్ లో దారుణంగా నిరాశ పరిచిన సినిమాల జాబితాలో మృగరాజు కూడా ఉంటుంది. మృగరాజు చిత్రాన్ని అప్పట్లోనే అత్యధిక బడ్జెట్ లో నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాత దేవి వరప్రసాద్. 

25
భారీ అంచనాలతో విడుదలైన మృగరాజు 

చిరంజీవితో ఆయన ఘరానా మొగుడు, అల్లుడా మజాకా, కొండవీటి రాజా లాంటి హిట్ చిత్రాలు నిర్మించారు. గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవితో బడ్జెట్ గురించి ఆలోచించకుండా దేవీ వరప్రసాద్ నిర్మించిన మృగరాజు దారుణంగా ఫ్లాప్ అయింది. రిలీజ్ రోజే ఈ చిత్రం ఫ్లాప్ అని తేలిపోయింది. దీనితో రిలీజ్ రోజే చనిపోవాలని అనిపించింది అంటూ దేవీ వరప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ చిత్రానికి ఆయన పెట్టిన ఖర్చు అలాంటిది. ఆర్థికంగా ఆయన్ని మృగరాజు చిత్రం బాగా కుంగదీసింది. మృగరాజు సినిమా ఆర్థికంగా తీసిన దెబ్బతో ఆయన కోలుకోలేకపోయారని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. 

35
నిర్మాత చేసిన తప్పుల వల్లే.. 

అంతటి భారీ అంచనాలతో విడుదలైన మృగరాజు మూవీ డిజాస్టర్ కావడానికి కారణాలని డైరెక్టర్ గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. మృగరాజు సినిమా ఫ్లాప్ కావడానికి కారణం నేను కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దేవి వరప్రసాద్ గారితో మంచి రిలేషన్ ఉండేది. దేవి వరప్రసాద్ గారు చేసిన మిస్టేక్స్ వల్లే మృగరాజు చిత్రానికి అలాంటి రిజల్ట్ వచ్చింది. 

45
రిలీజ్ విషయంలో సడెన్ డెసిషన్ 

వాస్తవానికి మృగరాజు సినిమాని 2001 సమ్మర్ కి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ నిర్మాత సడెన్ గా కొన్ని రోజుల ముందే సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనితో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి నాకు ఎక్కువ టైం దొరకలేదు. నేను పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుంటున్న టైంలో దేవీ వరప్రసాద్ గారే భారీ సెట్ ఒకటి వేయించి, లెక్కకి మించిన ఖర్చు పెట్టి ఒక సాంగ్ ని షూట్ చేశారు. విపరీతమైన బడ్జెట్ పెట్టారు. రిలీజ్ ని సమ్మర్ కి ప్లాన్ చేసి ఉంటే సినిమా మంచి షేప్ కి వచ్చేది. కానీ హడావిడిగా రిలీజ్ చేయడం వల్ల దెబ్బ తగిలింది అని గుణశేఖర్ అన్నారు. 

55
కథ నాది కాదు 

పైగా మృగరాజు సినిమా నా కథ కాదు. ఆల్రెడీ రెడీ అయిపోయిన స్క్రిప్ట్ లోకి తాను ఎంటర్ అయినట్లు గుణశేఖర్ తెలిపారు. ఒక దర్శకుడిగా ఆ కథని అందంగా మలచలేకపోవడమే తన ఫెయిల్యూర్ అని గుణశేఖర్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories