ఐబొమ్మ రవి అరెస్ట్ పై తండ్రి ఊహించని రియాక్షన్.. ప్రభుత్వానికే సవాల్‌ విసిరితే ఇలానే ఉంటది

Published : Nov 17, 2025, 05:22 PM IST

ఐబొమ్మ సైట్‌లో సినిమాల పైరసీ చేస్తోన్న ఇమ్మంది రవి అరెస్ట్ పై ఆయన తండ్రి అప్పారావు స్పందించారు. ఆయన ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. పోలీసులకు సవాల్‌ విసిరేంత పెద్దోడు అయ్యాడా అంటూ రియాక్ట్ అయ్యారు. 

PREV
15
ఐబొమ్మ రవి అరెస్ట్ పై తండ్రి స్పందన

సినిమాల పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆయనపై అనేక పైరసీ కేసులున్నాయి. ఈ క్రమంలో శనివారం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అరెస్ట్ కి సంబంధించిన వివరాలను వెల్లడించారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌. అయితే కొడుకు అరెస్ట్ పై తాజాగా తండ్రి అప్పారావు స్పందించారు. ఈ విషయం తనకు బంధువుల ద్వారా తెలిసిందని, వాళ్లు పేపర్‌లో చూసి తెలుసుకున్నారని అన్నారు. అంతకు మించి తనకు దీని గురించి ఏమీ తెలియదన్నారు. అంతేకాదు కొడుక్కి పెద్ద ఝలక్‌ ఇచ్చారు.

25
పైరసీ సైట్‌ నడిపిస్తున్నట్టు నాకు తెలియదు

రవిని డిగ్రీ వరకు చదివించానని, ఆంధ్రా యూనివర్సిటీలోనూ చదువుకున్నాడని,  అప్పట్నుంచి తన ఖర్చులు తానే చూసుకునేవాడని చెప్పారు తండ్రి. ఆ తర్వాత హైదరాబాద్‌కి వెళ్లినట్టు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత సాఫ్ట్ వేర్‌ కంపెనీలో జాబ్‌ వచ్చిందని చెప్పినట్టు, రవితో మాట్లాడి రెండు నెలలపైనే అవుతుందన్నారు. రవిపై కేసులు నమోదైనట్టు తనకు తెలియదని, రవి పైరసీ సైట్‌ని నడుపుతున్నాడని గానీ తెలియదన్నారు. ఇవేవీ తనతో మాట్లాడలేదని, ఏవీ చెప్పేవాడు కాదని తెలిపారు. కొడుకుని అరెస్ట్ విషయంపై స్పందిస్తూ, సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అని, రవి కేసుని హైదరాబాద్‌ పోలీసులు చూసుకుంటారని తెలిపారు.

35
కుటుంబం మొత్తం పటాపంచలు

రవి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణాలు తండ్రి అప్పారావు చెబుతూ.. తనకు, భార్యకి కొడవలు వచ్చాయట. దీంతో కొంత కాలం దూరంగా ఉన్నామని తెలిపారు. ఆ తర్వాత ఎవరికి వాళ్లం పటాపంచలమైపోయామని, అంతకు ముందు ఇంటి నుంచి బయటకు వెళ్లేవాళ్లం కాదని, అలాంటిది ఇప్పుడు నలుగురం ఊర్లమీద పడిపోయామన్నారు తండ్రి. ఒక్క ఆడపిల్ల ఉంటే పెళ్లి చేశామని, మొన్నటి వరకు ఇంటి దగ్గరే ఉందని, ఆ తర్వాత అల్లుడు వచ్చి తీసుకెళ్లాడని చెప్పాడు. రవి ఏదో నెట్‌ వర్క్ పనులు చేస్తున్నాడని, పొట్టకూటి కోసం ఏదో పని చేస్తున్నాడని అనుకునే వాడిని, కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాడని తెలియదు. ఇంటికొచ్చి రెండు ఏళ్లు అవుతుంది, అంతకు ముందు తనకు రావాల్సినప్పుడు వచ్చేవాడని తెలిపారు అప్పారావు.

45
రవి పెళ్లి చేసుకుని విడిపోయాడు

రవి లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడని, పెద్దల్లుడే  హైదరాబాద్‌లో పెళ్లి చేశాడని, కోడలు పెద్ద ఉద్యోగం చేస్తుందని, కానీ ఆ తర్వాత వాళ్లిద్దరి విడిపోయారని తెలిసిందన్నారు. వారికి ఓ పాప కూడా ఉందని, కలిసి ఉండాలని చాలా సార్లు చెప్పానని, కానీ వినడం లేదన్నారు. అయితే రవి చేసేందే ఎదవ పని, కానీ పోలీసులకు సవాల్‌ విసిరితే వాళ్లు ఊరుకుంటారని, వాళ్లు ఏం చేయాలో అది చేస్తారు, ప్రభుత్వంతో పెట్టుకోవద్దని, అలాంటి రవి అలా చేయడం కరెక్ట్ కాదని, ప్రభుత్వానికే సవాల్‌ విసిరేంత పెద్దోడు అయ్యాడా? అంటూ రివర్స్ ప్రశ్నించాడు తండ్రి. చట్టం ప్రకారం ఏం చేయాలనుకున్నారో అది చేస్తారని, ఈ విషయంలో తాను ఏం చెప్పలేనని వెల్లడించారు రవి తండ్రి అప్పారావు. 

55
కరేబియన్‌ దీవుల నుంచి పైరసీ రాకెట్‌

కరేబియన్‌ దీవుల నుంచి ఈ ఇంటర్నేషనల్‌ పైరసీ రాకెట్‌ని నడిపిస్తున్న రవి స్వస్థలం విశాఖపట్నం అని పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లిలోని ఉంటున్నాడు. ఆయన ఫ్లాట్‌ని సోదా చేయగా, హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాల హెచ్‌డీ ప్రింట్లు, అనేక కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తెలుగు సినిమాలే కాదు, ఇతర భాషలు, ఇతర దేశాల సినిమాలు కూడా ఉండటం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories