రవిది చిన్నప్పట్నుంచి క్రిమినల్ మైండ్ అని, ఇలాంటివి చాలా చేశాడని తెలిపారు. ఇలాంటి సైట్ల విషయంలో, పైరసీ సినిమాలు చూసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫ్రీగా వస్తుందని చూస్తే మీ డాటా అంతా వాళ్లు దోచుకుంటున్నారని, తర్వాత మీరు చాలా సమస్యల్లో పడతారని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌తోపాటు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి తెలిపారు. ఏదైనా ఒరిజినల్ కంటెంట్‌ని చూడాలని, ఫేక్ కంటెంట్ చూస్తే అది మీకు నష్టమని సజ్జనార్ చెప్పారు. మీ డాటా క్రిమినల్స్ చేతిలో పెట్టడం వల్ల సైబర్ నేరాలు జరుగుతాయని, దీని వల్ల వ్యక్తిగతంగా చాలా దారుణమైన నష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుందన్నారు. ఏదైనా ఇలాంటి సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు తెలిస్తే 1930కి కాల్ చేయాలని తెలిపారు హైదరాబాద్ సీపీ.