పెళ్లి.. విడాకులు.. రిపీట్..! మూడో భర్తకు విడాకులిచ్చిన నటి

Published : Nov 17, 2025, 04:04 PM IST

Meera Vasudevan Divorce : నటుడు జయం రవి 'అడంగమరు' సినిమాలో నటించిన నటి, 2023లో మూడో పెళ్లి చేసుకుని, రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది.

PREV
14
Meera Vasudevan Third Divorce

నటి మీరా వాసుదేవన్ తన పెళ్లి బంధానికి ముగింపు పలికినట్లు ధృవీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. సినిమాటోగ్రాఫర్ విపిన్‌తో తన బంధానికి ముగింపు పలికింది.

24
సినిమాటోగ్రాఫర్ విపిన్ తో విడాకులు

''నేను నటి మీరా వాసుదేవన్‌. ఆగస్టు 2025 నుంచి సింగిల్‌గా ఉంటున్నాను. నా జీవితంలో ప్రశాంతమైన దశలో ఉన్నాను,'' అని మీరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 2023లో విపిన్‌ను పెళ్లి చేసుకుంది.

34
మూడో పెళ్లి బంధం కూడా ముగిసింది

'తన్మాత్ర' సినిమాతో మీరా వాసుదేవన్ మలయాళంలో ఫేమస్ అయ్యింది. 'కుటుంబవిళక్కు' సీరియల్‌తో రీ-ఎంట్రీ ఇచ్చింది. అదే సీరియల్ సినిమాటోగ్రాఫర్ విపిన్‌ను పెళ్లి చేసుకుంది. ఇది ఆమెకు మూడో పెళ్లి.

44
మీరా వాసుదేవన్ వరుస పెళ్ళిళ్ళు, విడాకులు 

2023లో విపిన్‌తో మూడో పెళ్లి తర్వాత, మీరా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. వారి వయసు తేడా, మీరా గత పెళ్లిళ్లపై ట్రోల్స్ వచ్చాయి. జయం రవి 'అడంగమరు' సినిమాలో మీరా నటించింది. మీరా వాసుదేవన్ 2005లో విశాల్ అగర్వాల్ ని వివాహం చేసుకున్నారు. 2010లో అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె నటుడు జాన్ కొక్కెన్ ని చేసుకుంది. అతడి నుంచి కూడా 2016 లో విడిపోయింది. ఆ తర్వాత ఆమె సినిమాటోగ్రాఫర్ విపిన్ ని మూడో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతడికి కూడా విడాకులు ఇచ్చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories