Tamannaah: విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. తమన్నా కామెంట్స్

Published : Feb 18, 2026, 12:11 PM IST

Tamannaah: స్టార్ హీరోయిన్ తమన్నా కెరీర్ మొదట్లో 'నో కిస్సింగ్' పాలసీ పెట్టుకుంది. కానీ విజయ్ దేవరకొండకు మాత్రం లిప్‌లాక్‌ ఇస్తానని గతంలో ఒకసారి చెప్పింది. ఇప్పుడు రష్మిక మందన్న, విజయ్ పెళ్లి వార్తల నేపథ్యంలో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
14
రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.  ఇదే సమయంలో గతంలో తమన్నా చేసిన లిప్‌లాక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ తెగ షేర్ అవుతున్నాయి. 

కన్నడలో 'జాగ్వార్', 'కేజీఎఫ్' సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది తమన్నా. సౌత్ ఇండియాలో తమన్నా టాప్ హీరోయిన్ కూడా. ముఖ్యంగా తెలుగు, తమిళంలో స్టార్‌డమ్ సంపాదించుకుంది  ఈ బ్యూటీ.  కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించింది. కానీ హిందీలో సక్సెస్ కాలేకపోయింది.  ప్రస్తుతం తమన్నా మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

24
నో కిస్సింగ్ పాలజీ

తమన్నా చాలా చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయింది. కనీసం కాలేజీలో కూడా అడుగుపెట్టలేదు. స్కూలింగ్ పూర్తవ్వగానే తెలుగులో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆమె సినీ రంగంలో అడుగుపెట్టాక ఒక విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. అదే లిప్‌లాక్ విషయం. ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు దాటినా, స్టార్ హీరోయిన్‌గా ఉన్నా కూడా లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్లు ఆమె చేయడానికి ఇష్టం లేదని చెప్పేది. ఇలాంటి సీన్లలో నటించనని ఓ కండిషన్ పెట్టుకున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

34
విజయ్‌కు ముద్దు పెడతా

తమన్నాకు విజయ్ దేవరకొండ అంటే మాత్రం ప్రత్యేక అభిమానం. గతంలో ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ్ దేవరకొండతో అయితే లిప్‌లాక్ చేయడానికి తాను రెడీగా ఉంటానని తమన్నా చెప్పింది. అప్పట్లో  అది పెద్ద చర్చకు దారితీసింది. హాట్ యాక్టర్‌గా పేరున్న విజయ్‌తోనే కిస్ సీన్ చేయడానికి ఆమె ఎందుకు ఓకే చెప్పిందనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. తమన్నా కూడా ఆ విషయం చెప్పలేదు.

44
రూల్ బ్రేక్ చేసింది

నో కిస్సింగ్ పాలసీ పెట్టుకున్న తమన్నా తరువాత  తన మాట మీద నిలబడలేదు. 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లో తను పెట్టుకున్న రూల్ తానే బ్రేక్ చేసింది. ఆ సిరీస్‌లో లిప్‌లాక్ చేయడమే కాకుండా, చాలా హాట్‌గా నటించింది. 'లస్ట్ స్టోరీస్ 2'లో తన బాయ్‌ఫ్రెండ్ అని చెప్పే విజయ్ వర్మతో కలిసి తమన్నా నటించింది. అందుకే లిప్‌లాక్‌కు ఒప్పుకున్నానని ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు విజయ్ వర్మతో కూడా విడిపోయింది తమన్నా.

Read more Photos on
click me!

Recommended Stories