Hero Suhas: స్టార్‌ హీరోయిన్‌ ముందు అవమానించారు, కానీ కీర్తిసురేష్‌తో చేశా.. సుహాస్‌ ఎమోషనల్‌

Published : Feb 18, 2026, 11:08 AM IST

యంగ్‌ హీరో సుహాస్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. అయితే ప్రారంభంలో తాను చాలా అవమానాలు ఫేస్‌ చేశాడట. స్టార్‌ హీరోయిన్‌కి క్లోజ్‌గా ఉండే రోల్‌ అని పిలిచి అవమానించారట. 

PREV
15
`కలర్‌ ఫోటో`తో హీరోగా పాపులర్‌ అయిన సుహాస్‌

యంగ్‌ హీరో సుహాస్‌.. హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత హీరో అయ్యాడు. `కలర్‌ఫోటో` ఆయన లైఫ్‌నే మార్చేసింది. ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. దీంతో సుహాస్‌ ఇప్పుడు ప్రామిసింగ్‌ హీరో అయిపోయాడు. కంటెంట్‌ ఉన్న చిత్రాలు, మంచి కాన్సెప్ట్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన `హే బల్వంత్‌` అనే మూవీలో హీరోగా నటించాడు.

25
హే బల్వంత్‌తో రాబోతున్న సుహాస్

గోపీ అచ్చర దర్శకత్వం వహించగా, ఇందులో సుహాస్‌కి జోడీగా శివానీ నగరం హీరోయిన్‌గా చేసింది. వీకే నరేష్‌, హర్షవర్థన్‌, యాంకర్‌ స్రవంతి, అజయ్‌ ఘోష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మొదట ఈ మూవీకి `హే భగవాన్‌` అనే టైటిల్‌ని అనుకున్నారు. సెన్సార్‌ బోర్డ్ సభ్యుల నిర్ణయం మేరకు `హే బల్వంత్‌` గా మార్చారు. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని నిర్వహించారు. ఇందులో సుహాస్‌ మాట్లాడుతూ, ఎమోషనల్‌ అయ్యారు. తాను ఫేస్‌ చేసిన అవమానాలను వెల్లడించారు.

35
హీరో సుహాస్‌కి అవమానాలు

ఒక పెద్ద సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ పక్కన క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారట. హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర, ఇతన్నెందుకు పిలిచారని తన ముందే అన్నారట. వారికి థ్యాంక్స్ చెబుతూ, కట్‌ చేస్తే, కొన్ని ఏళ్ల తర్వాత  కీర్తిసురేష్‌ తో `ఉప్పుకప్పురంబు` అనే సినిమా చేసినట్టు తెలిపారు సుహాస్‌. తాను కీర్తిసురేష్‌కి పెద్ద అభిమాని అని, నువ్వు, వీడేంటి అనే దగ్గర నుంచి హాయ్‌ సుహాస్‌ అని కీర్తిసురేష్‌ హగ్‌  ఇచ్చే వరకు వచ్చాను. ఆమెకి మా ఇంటి వంటలు పంపించే అదృష్టం దక్కింది. మా భార్య రకరకాల వంటలు చేసి పంపించారు. ఇప్పుడు మేం ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం వచ్చింది. తన విషయంలో ఇదే సక్సెస్‌ అని తెలిపారు సుహాస్‌.  

45
నేనే హీరో అయ్యాను, మీరూ ఈజీగా కావచ్చు

హీరోకి కావాల్సిన ఎలాంటి లక్షణాలు లేని నేను హీరో అయ్యాను. సినిమాలు చేస్తున్నారు. అలాంటి మీరు కూడా హీరో కావడం ఈజీ అని వెల్లడించారు సుహాస్‌. ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు సుహాస్‌. టాలెంట్‌ ఎవరి సొత్తు కాదని, హీరోకి ఇలాంటి క్వాలిటీసే ఉండాలనే రూల్స్ బ్రేక్‌ చేసిన హీరో సుహాస్‌ కావడం విశేషం. 

55
ఫాదర్ అండ్‌ సన్‌ ఎమోషన్‌తో `హే బల్వంత్‌`

వంశీ నందిపాటి మాట్లాడుతూ '' డేట్‌లు మారినా, టైటిల్‌ మారినా, ఫిబ్రవరి 20న మా సినిమా క్రియేట్‌ చేసే ఇంపాక్ట్‌ మారదు. ఈసినిమాలో లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ ఉన్నాయి. ఇవి అందరికి బాగా నచ్చుతాయి. మన లైఫ్‌లో ఫాదర్‌ అండ్‌ సన్ ఎమోషన్‌ ఈ సినిమా ఉంటుంది. ఇది హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌. సినిమా చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు మన రియల్‌లైఫ్‌లో కూడా కనెక్ట్‌ అవుతాం. ఈ సినిమా చూసిన వాళ్ల డబ్బులకు న్యాయం జరుగుతుంది.  హాండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే సినిమా ఇది` అని తెలిపారు. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు గోపీకి అందరి సమక్షంలో రెండో సినిమాకి అడ్వాన్స్ చెక్‌ ఇచ్చారు వంశీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories