మనకంటే వెయ్యి కోట్ల సినిమాలు చాలా గొప్పగా కనిపిస్తాయి కాని.. హాలీవుడ్ కు అలా కాదు. అక్కడ ఇది కామన్. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేవి. వరల్డ్ బాక్సాఫీస్ ను శాసించిన టాప్ 5 మూవీస్ గురించి చూద్దాం.
హాలీవుడ్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది గ్రాండియర్‌నే. అలా తమ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమాన గణాన్ని ఏర్పరుచుకుంది హాలీవుడ్. ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఇంటర్‌స్టెల్లార్ సినిమా రీ-రిలీజ్ అయి కలెక్షన్ల రికార్డు సృష్టించింది. ఆ స్థాయిలో హాలీవుడ్ సినిమాలపై మోజు భారతీయుల్లో పెరిగిపోయింది. ఈ కలెక్షన్‌లో హాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన టాప్ 5 ఫ్రాంచైజ్‌ల గురించి చూద్దాం.
యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలను వరుసగా నిర్మిస్తోంది. ఈ సినిమా ఒక ఫ్రాంచైజ్‌గా మారి ఇప్పటివరకు దీని కింద 11 సినిమాలు విడుదలయ్యాయి. కార్ ఛేజింగ్ సీన్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో స్పెషల్. ఈ ఫ్రాంచైజీలో 2015లో విడుదలైన ఫ్యూరియస్ 7 సినిమా ఎక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.52 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అలాగే ఈ ఫ్రాంచైజీలోని 11 సినిమాల మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు 7.32 బిలియన్ డాలర్లు.
జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు మొత్తం 27 జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చాయి. ఇందులో 2012లో విడుదలైన స్కై ఫాల్ సినిమా ఎక్కువ వసూళ్లు సాధించిన జేమ్స్ బాండ్ సినిమా. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.11 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు విడుదలైన 27 జేమ్స్ బాండ్ సినిమాల మొత్తం వసూళ్లు 7.88 బిలియన్ డాలర్లు.
90ల పిల్లలకి ఫేవరెట్ సూపర్ హీరో అంటే అది స్పైడర్ మేన్. సోనీ పిక్చర్స్ నిర్మాణంలో ఇప్పటివరకు మొత్తం 10 స్పైడర్ మేన్ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2021లో విడుదలైన స్పైడర్ మేన్ నో వే హోమ్ సినిమా 1.95 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజీలో విడుదలైన 10 సినిమాలు మొత్తం 9.03 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాయి.
వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మాణంలో గ్రాండ్‌గా తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులు ఉన్న ఫ్రాంచైజ్‌లలో స్టార్ వార్స్ ఒకటి. ఇప్పటివరకు మొత్తం 12 స్టార్ వార్స్ సినిమాలు వచ్చాయి. ఇందులో 2016లో విడుదలైన ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్” సినిమా 2.07 బిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్‌లో ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 12 సినిమాల మొత్తం వసూళ్లు 10.36 బిలియన్ డాలర్లు.
హాలీవుడ్‌లో బాక్సాఫీస్ కింగ్‌గా వెలుగొందుతోంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఆ ఫ్రాంచైజీ కింద ఇప్పటివరకు 35 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఎక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 2.8 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ యూనివర్స్ కింద వచ్చిన 35 సినిమాల మొత్తం వసూళ్లు 31.48 బిలియన్ డాలర్లు.