అయితే కెరీర్ బిగినింగ్ లో సుధాకర్ హీరోగా, విలన్ గా కూడా నటించారు. తమిళంలో అనేక చిత్రాల్లో సుధాకర్ హీరోగా నటించారు. తమిళంలో సుధాకర్ ఎంట్రీ ఇచ్చింది హీరోగానే. అప్పటి స్టార్ హీరోయిన్ రాధికతో కలసి సుధాకర్ ఏకంగా 13 చిత్రాల్లో నటించారు. అంత బాగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. కానీ వీళ్లిద్దరి పరిచయమే తీవ్రమైన గొడవతో మొదలైంది.